ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 5 అక్టోబరు 2018 (11:46 IST)

తనూశ్రీకి 'నానా' వేధింపులు... 'పటేకర్‌'లో చీకటి కోణం ఉంది : డింపుల్

బాలీవుడ్ నటి తనూశ్రీ దత్తాకు బాలీవుడ్ నటుడు నానా పటేకర్ పెట్టిన లైంగిక వేధింపులపై బాలీవుడ్ హీరోయిన్లు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాజాగా డింపుల్ కపాడియాతో పాటు కాజోల్ కూడా స్పందించారు. నానా పటేకర్

బాలీవుడ్ నటి తనూశ్రీ దత్తాకు బాలీవుడ్ నటుడు నానా పటేకర్ పెట్టిన లైంగిక వేధింపులపై బాలీవుడ్ హీరోయిన్లు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాజాగా డింపుల్ కపాడియాతో పాటు కాజోల్ కూడా స్పందించారు. నానా పటేకర్ ప్రవర్తన పట్ల నటి డింపుల్‌ కపాడియా అభ్యంతరం వ్యక్తం చేసింది.
 
తాజాగా ఓ ఇంటర్వ్యూలో నానా పటేకర్ విషయమై డింపుల్ మాట్లాడుతూ.. వ్యక్తి పరంగా అతడు చాలా మంచివాడు. మంచి స్నేహితుడు. అతడు గొప్ప నటుడు. కానీ అతడి జీవితంలో ఓ చీకటి కోణం కూడా ఉందంటూ డింపుల్ చెప్పుకొచ్చింది. నానా పటేకర్‌ తనను వేధించారని తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలకు ఇప్పటికే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు మద్దతు తెలిపారు.
 
అలాగే, కాజోల్ స్పందిస్తూ, తానెప్పుడూ లైంగిక వేధింపులు ఎదుర్కోలేదని, అయితే దాని గురించి విన్నానని తెలిపింది. వేధించినవారు ఎవరైనా బయటకొచ్చి మేం ఇటువంటి పని చేశామని చెప్పుకోరు కదా. తన కళ్ల ముందు ఇలాంటి ఘటన జ‌రిగితే చూస్తూ ఉండేదాన్ని కాదని, తప్పకుండా ఏదో ఒకటి చేసేదాన్నని స్పష్టంచేసింది. 
 
అయితే లైంగిక వేధింపులు అనేవి కేవలం చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితం కాలేదని, అన్ని రంగాల్లో ఉన్నాయని కాజోల్ చెప్పుకొచ్చింది. లైంగిక వేధింపులకు నిలిపేసేందుకు విదేశాల్లో తీసుకొచ్చిన మీ టూ ఉద్యమం లాంటిది మన దగ్గర కూడా రావాల్సిన అవసరముందని అభిప్రాయపడింది.