గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (10:49 IST)

తనూశ్రీ ఎంత ఇబ్బండి పడిందో నేను అర్థం చేసుకోగలను : శిల్పాశెట్టి

బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్ నానా విధాలుగా వేధించాడంటూ సినీనటి తనూశ్రీ దత్తా చేసిన ప్రకటనపై బాలీవుడ్ సీనియర్ నటి శిల్పాశెట్టి స్పందించారు.

బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్ నానా విధాలుగా వేధించాడంటూ సినీనటి తనూశ్రీ దత్తా చేసిన ప్రకటనపై బాలీవుడ్ సీనియర్ నటి శిల్పాశెట్టి స్పందించారు. 'అసలు ఆ రోజు ఏం జరిగిందో నాకు స్పష్టంగా తెలియదు... కానీ సెట్స్‌లో ఉండగా అలాంటి హింసకు తావుండదని నా అభిప్రాయం. అక్కడ స్త్రీ, పురుషులపై ఎలాంటి ఒత్తిడి ఉండదని నేను నమ్ముతున్నాను. కానీ తనుశ్రీ విషయంలో మాత్రం నేను చాలా బాధపడుతున్నా. అక్కడ ఆమె ఎంత ఇబ్బంది పడిందో నేను అర్థం చేసుకోగలను' అని అభిప్రాయపడ్డారు.
 
మరోవైపు, తనూశ్రీ దత్తాపై నానా పటేకర్ మండిపడ్డారు. ఆమె వ్యాఖ్యలను ఖండించడమే కాకుండా, న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్టు ప్రటించారు. పదేళ్ళ క్రితం ఓ సాంగ్ షూటింగ్‌లో భాగంగా నటుడు నానా పటేకర్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ తనూశ్రీ దత్తా ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే.