గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (16:03 IST)

డాన్స్ భంగిమల గురించి చెప్తానని.. అలా ప్రవర్తించాడు.. బాలయ్య హీరోయిన్

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై హీరోయిన్లు నోరు విప్పుతున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు పాకిన మీటూపై కూడా హీరోయిన్లు స్పందిస్తున్నారు. పనిలో పనిగా క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై కూడా హీరో

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై హీరోయిన్లు నోరు విప్పుతున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు పాకిన మీటూపై కూడా హీరోయిన్లు స్పందిస్తున్నారు. పనిలో పనిగా క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై కూడా హీరోయిన్లు తమకు ఎదురైన అనుభవాలను బయటకు చెప్తున్నారు. తాజాగా క్యాస్టింగ్ కౌచ్‌పై తెలుగులో బాలయ్య సరసన 'వీరభద్ర' సినిమాలో నటించిన తనుశ్రీ దత్తా స్పందించింది. 
 
బాలీవుడ్‌లో చాలా సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా వుంటుంది. ఒకప్పుడు గ్లామర్ పంట పండించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బొద్దుగుమ్మగా మారిపోయింది. ఇటీవల ముంబై ఎయిర్‌పోర్ట్‌లో తళుక్కున మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 
 
సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు నిజమేనని తెలిపింది. తాను కూడా వాటి బాధితురాలేనని స్పష్టం చేసింది. 2008లో ఓ సినిమా షూటింగ్‌లో తన సహనటుడు చాలా ఇబ్బంది పెట్టాడని, డాన్స్ భంగిమల గురించి వివరిస్తానని చెప్పి తనతో తప్పుగా ప్రవర్తించాడని తనుశ్రీ వెల్లడించింది. 
 
కానీ సదరు నటుడి పేరుని మాత్రం ఆమె బయటపెట్టలేదు. తానే కాకుండా చాలామంది హీరోయిన్లు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారని కామెంట్లు చేసింది. సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి వేధింపులను బయటికి చెప్పలేకపోతున్నారని అభిప్రాయపడింది. మీ టూ ఉద్యమం బాలీవుడ్‌కు అంతగా రీచ్ కాలేదని చెప్పింది.