శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (15:54 IST)

బాదం పప్పులను తీసుకుంటే... ఇవీ లాభాలు...

ఉదయాన్నే హడావిడిగా ఏదో ఒక బ్రేక్‌ఫాస్ట్ తీసుకోకుండా ముందుగా సీజనల్ పండ్లను తీసుకోవాలి. ఆ తరువాత నానబెట్టిన బాదంపప్పులు అనంతరం బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవాలి. ఇలా చేయడం వలన రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు పెర

ఉదయాన్నే హడావిడిగా ఏదో ఒక బ్రేక్‌ఫాస్ట్ తీసుకోకుండా ముందుగా సీజనల్ పండ్లను తీసుకోవాలి. ఆ తరువాత నానబెట్టిన బాదంపప్పులు అనంతరం బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవాలి. ఇలా చేయడం వలన రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా ఉంటాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అలానే లంచ్, డిన్నర్ సమయానికి తీసుకోవాలి.
 
అంటే లంచ్ ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంట లోపు తీసుకోవాలి. లంచ్‌లో కచ్చితంగా మజ్జిగ చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీని వలన విటమిన్ డి, బి12, స్థాయిలు పెరుగుతాయి. ఇవి డయాబెటిస్ అదుపులో ఉంటుంది. పల్లీలను నిత్యం ఆహారంలో భాగంగా తీసుకోవాలి. వీటిని ప్రతిరోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు, లంచ్‌కు మధ్య లేద సాయంత్రం స్నాక్స్ రూపంలో తీసుకోవాలి. 
 
పల్లీలలో అమైనో యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుతాయి. వారానికి 5 రోజులు, రోజుకు 30 నిమిషాల పాటు వ్యాయామం చేయవలసి వస్తుంది. అలాకాకుంటే వాకింగ్ చేసినా చాలు డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చును.