శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : శనివారం, 22 సెప్టెంబరు 2018 (13:58 IST)

శనివారం (22-09-2018) రాశిఫలాలు : వారసత్వపు వ్యవహారాలలో చికాకులు

మేషం: ధనం బాగా వ్యయం చేసి అనుకున్న పనులు పూర్తిచేస్తారు. చిన్నతరహా, చిరువ్యాపారులకు పురోభివృద్ధి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. విదేశీయానం, రుణయత్నాలు అనుకూలిస్తాయి. దైవ, పుణ్య కార్యక్రమ

మేషం: ధనం బాగా వ్యయం చేసి అనుకున్న పనులు పూర్తిచేస్తారు. చిన్నతరహా, చిరువ్యాపారులకు పురోభివృద్ధి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. విదేశీయానం, రుణయత్నాలు అనుకూలిస్తాయి. దైవ, పుణ్య కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలతో హడావుడిగా ఉంటారు.
 
వృషభం: వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు. కలిసివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆదాయాభివృద్ధి, మానసిక ప్రశాంతత, సంఘంలో గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. ఉద్యోగస్తులు ప్రమోషన్స్ పొందే సూచనలు అధికంగా ఉన్నాయి.
 
మిధునం: ఎదుటివారి వ్యాఖ్యాలను ధీటుగా స్పందిస్తారు. మీపై వచ్చిన అభియోగాలు తొలగిపోగలవు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. సంతానం మెుండివైఖరి అసహానం కలిగిస్తుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. దూరప్రయాణాలు కలిసివస్తాయి.
 
కర్కాటకం: వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులు ఉద్యోగయత్నంలో నిరుత్సాహం వీడిన సత్ఫలితాలు ఉంటాయి. కోర్టు వాయిదాలు వాయిదా పడడం మంచిది. పుణ్యక్షేత్రాల దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. విద్యార్థులు సాహస ప్రయత్నాలు విరమించండి.
 
సింహం: చేపట్టిన పనులు ప్రారంభంలో నెమ్మదించినా సమయానికి పూర్తిచేయ గలుగుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విద్యార్థులకు పరిచయాలు, నూతన వాతావరణం ఉత్సాహం కలిగిస్తాయి. ఆరోగ్యం సంతృప్తికరం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశీయాన యత్నాల్లో స్వల్ప ఆటంకాలు తప్పవు.
 
కన్య: ఆకస్మిక ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. గృహనిర్మాణ పనులు ప్రారంభంలో మందగించినా క్రమేనా వేగవంతమవుతాయి. అవివాహితులకు శుభదాయకం. దూరప్రయాణం తలపెడతారు. వారసత్వపు వ్యవహారాలలో చికాకులు తప్పవు. రసాయన, ఆల్కహాల్, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి.
 
తుల: విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు అధికం. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, విశ్రాంతి లోపం. ఉద్యోగ, విద్య ప్రకటనల పట్ల అవగాహన అవసరం. మీ పట్ల ముభావంగా ఉండే వ్యక్తులు మీకు దగ్గరయ్యేందుకు యత్నిస్తారు.
 
వృశ్చికం: సహోద్యోగుల తీరు అసహానం కలిగిస్తుంది. ఇంజనీరింగి, శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సామాన్యం. గృహనిర్మాణాలు, మార్పులు, చేర్పులు, మరమ్మత్తులకు అనుకూలం. వీలైనంత వరుకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది.
 
ధనస్సు: స్త్రీలు షాపింగ్ వ్యవహారాలు, దూరప్రయాణాల్లో మెళకువ వహించండి. పెద్దల ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. బంధుమిత్రులలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. చిన్ననాటి పరిచయస్తులు తారసపడుతారు. సేవా సంస్థలకు సాయం అందిస్తారు. పరిచయాలు బలపడుతాయి. పెట్టుబడులకు అనుకూలం.
 
మకరం: కోళ్ళ, మత్స్య, గొర్రెల వ్యాపారులకు ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. తొందరపడి చెల్లింపులు జరుపవద్దు. ఉద్యోగస్తులు తరచు సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయలు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది.
 
కుంభం: దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. మీ సంతానం విషయంలో ఓర్పు, నేర్పు చాలా అవసరమని గమనించండి. ఆలయ సందర్శనాలలో నూత పరిచయాలు ఏర్పడుతాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ నిరుత్సాహపరుస్తుంది.
 
మీనం: సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. మీ హోదాకు తగినట్టుగా ధనం వ్యయం చేయవలసి వస్తుంది. ప్రైవేటు సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. మీ కృషికి కుటుంబీకులు, సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. విద్యార్థులకు కొత్త కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. కోర్టు వ్యవహారాలలో సంతృప్తికానరాదు.