శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Updated : ఆదివారం, 16 సెప్టెంబరు 2018 (09:14 IST)

16-09-2018 - ఆదివారం మీ రాశి ఫలితాలు... స్త్రీలకు అపరిచిత వ్యక్తుల పట్ల?

మేషం: ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. స్త్రీలకు సంపాదపట్ల ఆసక్తి పెరుగుతుంది. కోళ్ళ, మత్స్య, గొర్రెల వ్యాపారులకు ఆశించినంత పురోభివృద్ధి కానవస్తుంది. ఒకేసారి అనేక పనులు మీదపడడంతో అస

మేషం: ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. స్త్రీలకు సంపాదపట్ల ఆసక్తి పెరుగుతుంది. కోళ్ళ, మత్స్య, గొర్రెల వ్యాపారులకు ఆశించినంత పురోభివృద్ధి కానవస్తుంది. ఒకేసారి అనేక పనులు మీదపడడంతో అసహానానికి లోనవుతారు. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం.
 
వృషభం: ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీ పై మంచి ప్రభావం చూపుతాయి. కుటుంబంలో ప్రంశాతత నెలకొంటుంది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కుంటారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. 
 
మిథునం: ధనం బాగా సంపాదించి దేవాలయ, విద్యాసంస్థలకు దానధర్మాలు చేయడం వలన మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం పొందుతారు. ముఖ్యులతో కలిసి సరదాగా గడుపుతారు. ప్రతి విషయంలోను ఓర్పు, విజ్ఞతగా వ్యవహరించాలి. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది.  
 
కర్కాటకం: విద్యార్థులు అల్లర్లు, సామాజిక ఆందోళనలకు దూరంగా ఉండాలి. మీ పేరు ప్రతిష్టలకు భంగం కలుగకుండా జాగ్రత్త వహించాలి. పెద్దల ఆరోగ్యం కలవరపరుస్తుంది. పాత రుణాలు తీర్చడంతో పాటు విలువైన పరికరాలు అమర్చుకుంటారు. చిరకాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కరామవుతాయి.   
 
సింహం: ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మిక ప్రయాణఁ తలపెడతారు. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. విద్యార్థులకు కొత్త పరిచయాలు వ్యాపకాలు ఉత్సాహం కలగిస్తాయి. ట్రాన్స్‌పోర్ట్, ఎక్స్‌పోర్ట్, ఆటోమోబైల్ రంగాలవారికి పురోభివృద్ధి. ప్రేమికుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.  
 
కన్య: రవాణా రంగంలో వారికి సంతృప్తి కానరాగలదు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. దైవ, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనటంతే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
తుల: అలౌకిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీకు దగ్గరగా ఉన్నా మీకే తెలియని ఒక అవకాశం మిమ్మల్ని వరిస్తుంది. రాజకీయ కళా రంగాలవారికి విదేశీ పర్యటనలు అనుకూలం. మిత్రులు చేసిన వ్యాఖ్యాలు మనస్తాపం కలిగిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకోండి. 
 
వృశ్చికం: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి శుభదాయకం. ప్రైవేటు సంస్థలలోని వారికి ఊహించని మార్పులు సంభవిస్తాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. బంధువులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులు తోటివారి నుండి ఆహ్వనాలు అందుకుంటారు. ఒక ముఖ్య విషయమై న్యాయసలహా పొందవలసి వస్తుంది.  
 
ధనస్సు: వీసా, పాస్‌పోర్ట్ వ్యవహారాలు సానుకూలమవుతాయి. పెద్దలతో సంభాషించేటపుడు మెళకువ వహించండి. మీ కళత్ర మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. కాంట్రాక్టర్లకు నూతన పనులు చేపట్టే విషయంలో పునరాలోచన అవసరం. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుంది. 
 
మకరం: వృత్తి వ్యాపారులకు శ్రమకు తగిన ప్రతిఫళం లభిస్తుంది. స్త్రీల ఆలోచనలు, అభిప్రాయాలు పలు విధాలుగా ఉంటాయి. కొబ్బరి, పండ్లు, పూల, పానీయ వ్యాపారులకు లాభదాయకం. స్త్రీలకు అలంకరణలు, విలాసవస్తువుల మీద మక్కువ పెరుగుతుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. 
 
కుంభం: ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోగలవు. ఇతర కుటుంబ విషయాలకు దూరంగా ఉండడం మంచిది. రావలసిన ధనం సకాలం అందటం వలన ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించడం వలన అస్వస్థతకు లోనవుతారు. వ్యాపారులకు సంతృప్తి కానవస్తుంది.  
 
మీనం: కళ, క్రీడా, శాస్త్ర రంగాల వారికి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుంది. అంతగా పరిచయం లేని వారికి ధనసహాయం చేసే విషయంలో అప్రమత్తత అవసరం. చిన్నతరహా పరిశ్రమల వారికు పురోభివృద్ధి. స్త్రీల ఆలోచనలు, అభిప్రాయాలు పలు విధాలుగా ఉంటాయి. విలువైన వస్తువలు, ఆభరణాలు అమర్చుకుంటారు.