సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : గురువారం, 13 సెప్టెంబరు 2018 (09:49 IST)

13-09-2018 గురువారం దినఫలాలు - మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగాల్లో...

మేషం: ఆదాయానికి మించి ఖర్చులు అధికమవుతాయి. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఏదైనా అమ్మే ఆలోచన వాయిదా వేయడం మంచిది. రవాణా రంగాల వారికి ఆందోళనలు అధికమవుతాయి. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్

మేషం: ఆదాయానికి మించి ఖర్చులు అధికమవుతాయి. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఏదైనా అమ్మే ఆలోచన వాయిదా వేయడం మంచిది. రవాణా రంగాల వారికి ఆందోళనలు అధికమవుతాయి. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు కలిసివస్తుంది.
 
వృషభం: ఆర్థికంగా బాగుగా స్థిరపడుతారు. స్త్రీలకు పనివారలతో ఇబ్బందులు తలెత్తుతాయి. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ సంతానం వైఖరి మీకు ఎంతో చికాకు కలగిస్తుంది. మీ రాక బంధువులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
 
మిధునం: సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. బంధువుల రాకతో ఊహించన ఖర్చులు అధికమవుతాయి. ప్రముఖుల కలయికతో కొన్ని పనులు అనుకూలిస్తాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. దంపతుల మధ్య అనురాగవాత్సాల్యాలు పెంపొందుతాయి. వాహనం కొనుగోలుచేస్తారు.  
 
కర్కాటకం: ఉత్తర ప్రత్యుత్తరాలు, కీలక వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. శాంతి యుతంగా వ్యవహరిస్తే మీ సమస్యలు సానుకూలమవుతాయి. వస్త్రములు, ఆభరణాలు, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరికలు నెరవేరుతాయి. పోగొట్టుకున్న అవకాశం, పత్రాలు తిరిగి పొందుతారు. వాతావరణ ప్రతిబంధాలు, శ్రమాధిక్యత తప్పవు. 
 
సింహం: బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. పాతమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. సహచరుల సలహావలన నిరుద్యోగులు సదవకాశాలు జారవిడుచుకుంటారు. అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. 
 
కన్య: వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. పెద్దలు ఇచ్చే సలహా మీ కెంతో సంతృప్తినిస్తుంది. ఆహార వ్యవహారల్లో మెళకువ అవసరం. మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. వాతావరణంలోని మార్పులు వలన మీ పనులు వాయిదాపడుతాయి. ట్రాన్స్‌పోర్ట్ రంగాలలో వారికి పనివారలతో చికాకులు తలెత్తుతాయి.  
 
తుల: అకాల భోజనం, విశ్రాంతి లోపం వలన ఆరోగ్యం మందగిస్తుంది. సోదరీసోదరులతో అభిప్రాయబేధాలు ఏర్పడుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. పుణ్యకార్యక్రమాల్లో పాల్గొనటంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. స్వార్ధపూరిత ప్రయోజనాలు ఆశించి మీకు చేరువవ్వాలని భావిస్తున్న వారిని దూరంగా ఉంచండి.
 
వృశ్చికం: సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీ పైమంచి ప్రభారం చూపుతాయి. ఒక్కొసారి జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. 
 
ధనస్సు: మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. మీ తెలివితేటలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్త్రీలపై శకునాలు, ఇతరుల వ్యాఖ్యాలు తీవ్ర ప్రభావం చూపుతాయి. గృహమునకు కావలసిన వస్తువులు కొనుగోలుచేస్తారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.  
 
మకరం: ప్రేమికుల మధ్య అపార్ధాలు తొలగిపోతాయి. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికం. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో జయం పొందుతారు. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. మీ లక్ష్యం పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. అధికారుల సమీక్షా సమావేశాల్లో పాల్గొంటారు.    
 
కుంభం: అధైర్యపడకండి, ధైర్యంగా ముందుకు వెళ్ళండి. సోదరీసోదరులతో ఏకీభవించలేకపోతారు. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. పాతవస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కుంటారు. అర్ధాంతరంగా నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. 
 
మీనం: స్త్రీలకు విదేశీ వస్త్రములు, అలంకరణలు, విలాస వస్తువుల పట్ల ఆకర్షణ పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకల వలన గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. ఏది జరిగినా మంచికేనని భావించండి. హోటల్, క్యాటరింగ్ రంగాల్లో వారు పనివారలతో ఇబ్బందులు ఎదుర్కుంటారు.