శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : సోమవారం, 10 సెప్టెంబరు 2018 (09:06 IST)

10-09-2018 సోమవారం దినఫలాలు - మీ పనుల సానుకూలతలకు...

మేషం: టాక్స్ వంటి సమస్యలు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. ప్రైవేటు రంగాల్లో వారు మార్పులకోసం చేసే ప్రయత్నాలు అనుకూలించవు. ఎదుటివారితో సంభాషింటేటపుడు మెళకువ అవసరం. అప్రయత్నంగా కలిసివచ్చిన అవకాశాన్ని సద్

మేషం: టాక్స్ వంటి సమస్యలు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. ప్రైవేటు రంగాల్లో వారు మార్పులకోసం చేసే ప్రయత్నాలు అనుకూలించవు. ఎదుటివారితో సంభాషింటేటపుడు మెళకువ అవసరం. అప్రయత్నంగా కలిసివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.
 
వృషభం: ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతలకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. ఖర్చులు సామాన్యంగా ఉంటాయి. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. 
 
మిధునం: పెద్ద హోదాలో ఉన్నవారికి అధికారిక పర్యటనలు అధికమవుతాయి. విద్యుత్ లోపం అధికం కాడవం వలన ఆందోళనకు గురవుతారు. రిప్రజెంటివ్‌లకు నిర్దేశించబడిన గమ్యానికి చేరలేకపోవడం వలన ఇబ్బందులకు లోనవుతారు. సంగీత, సాహిత్య అభిలాష పెరుగుతుంది. విదేశీయ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
కర్కాటకం: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి ఆశాజనకంగా ఉండగలదు. ఉద్యోగస్తులకు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. మీకు పొట్ట, కాళ్ళు, నడుముకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. సంతాన ప్రాప్తి, సంతాన అభివృద్ధి శుభదాయకంగా ఉంటుంది.
 
సింహం: భాగస్వామ్యుల మధ్య పరస్పర అవగాహన లోపం, చికాకులు వంటివి తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి. కాంట్రాక్టర్లకు చేతిలో పని జారవిడుచుకునే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. సినిమా, కళా రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఒక్కోసారి మీ సంతానం మెుండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. 
 
కన్య: ఏదైనా స్థిరాస్తులు అమ్మకానికై చేయు యత్నాలు వాయిదా పడుతాయి. ఆయిల్, నూనె, గ్యాస్ వ్యాపారస్తులకు పనివారితో ఇక్కట్లు తలెత్తగలవు. వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థుల్లో కన్నా, విద్యార్థినులలో పురోభివృద్ధి కానవస్తుంది. సహకార సంఘాల్లో వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.  
 
తుల: కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల, ప్లీడరు గుమస్తాలు ఇబ్బందులు ఎదుర్కుంటారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కుంటారు. స్త్రీలకు విదేశీ వస్తువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. వ్యాపారులకు పోటీ పెరగటంతో ఆశించినంత పురోభివృద్ధి కానవస్తుంది.   
 
వృశ్చికం: విలాసాలకు, ఆడంబరాలకు వ్యయం చేసే విషయంలో ఆలోచన, పొదుపు అవసరం. ఉద్యోగస్తులు యూనియన్ వ్యవహారాలు, అనవసర విషయాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబీకుల మధ్య అభిప్రాయ బేధాలు తొలగిపోతాయి. రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. 
 
ధనస్సు: ఉపాధ్యాయులకు సంతృప్తి కానవస్తుంది. సహోద్యోగులతో అభిప్రాయబేధాలు తలెత్తుతాయి. బంధుమిత్రుల కలయిక మీకెంతో సంతృప్తినిస్తుంది. నిరుద్యోగులకు ప్రముఖ సంస్థలలో అవకాశాలు లభిస్తాయి. దైవ కార్యక్రమాల పట్ల, సాంఘిక కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. 
 
మకరం: పోస్టల్, ఎల్.ఐ.సి ఏజెంట్లకు శ్రమాధిక్యత మినహా ఆశించినంత ఫలితాలు ఉండవు. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. విదేశీయానం నిమిత్తం చేస్తున్న యత్నాలలో ఆటంకాలు తొలగిపోతాయి. రుణం ఏ కొంతయినా తీర్చాలనే మీ ఆలోచన వాయిదా పడుతుంది. 
 
కుంభం: తొందరపాటు నిర్ణయాల వలన ఒక్కోసారి మాటపడవలసి వస్తుంది. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. స్త్రీలు దైవ, పుణ్య కార్యాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. మీ సంతానం పైచదువుల కోసం బాగా శ్రమించాల్సి ఉంటుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత వహించిన సత్ఫలితాలు పొందగలరు.   
 
మీనం: విద్యార్థులకు విశ్రాంతి లోపం వలన ఆరోగ్యం మందగిస్తుంది. ఇతరులకు పెద్ద మెుత్తంలో ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన అవసరం. చిన్నారులకు విలువైన బహుమతులు అందజేస్తారు. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. మీ కుటుంబీకుల పట్ల మమకారం అధికమవుతుంది.