మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : శనివారం, 8 సెప్టెంబరు 2018 (09:22 IST)

08-09-2018 శనివారం దినఫలాలు - మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును...

మేషం: తల, కాళ్లు, చేతులు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. మిత్రులతో సంభాషించడం వలన మీలో మానసిక ధైర్యం, కొత్త ఉత్సాహం చోటు చేసుకుంటుంది. వాహనం ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. వృత్తుల్లో వా

మేషం: తల, కాళ్లు, చేతులు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. మిత్రులతో సంభాషించడం వలన మీలో మానసిక ధైర్యం, కొత్త ఉత్సాహం చోటు చేసుకుంటుంది. వాహనం ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. వృత్తుల్లో వారికి సమీప వ్యక్తుల సహకారం వలన అభివృద్ధి కానవస్తుంది.
 
వృషభం: స్త్రీలు కళాత్మక, క్రీడ, క్విజ్ పోటీల్లో రాణిస్తారు. ప్రముఖుల కలయికతో పనులు పూర్తవుతాయి. మీ సమస్య ఒకటి సానుకూలం కావడంతో మానసికంగా కుదుటపడుతారు. ఇతరులతో అతిగా మాట్లాడడం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. ముఖ్యులతో సంభాషించేటపుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది. 
 
మిధునం: మిమ్మల్ని హేళన చేసే వారు మీ సహాయాన్ని అర్ధిస్తారు. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. తలపెట్టిన పనులు విసుగు కలిగిస్తాయి. ఊహించని ఖర్చులు అధికమగుటవలన ఆందోళన చెందుతారు. సోదరీసోదరుల మధ్య ఏకీభవం కుదరదు. టి. వి., రేడియో రంగాలలో వారికి నిరుత్సాహం కానవస్తుంది. 
 
కర్కాటకం: స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పంతం అధికమవుతుంది. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి పై అధికారులను మెప్పిస్తారు. దైవ, పుణ్య కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలు, ఆస్తి పంపకాలకు సంబంధించిన చర్చలు ఒక కొలిక్కి వస్తాయి. 
 
సింహం: మీ ఆశయాలకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధాలు బలపడుతాయి. ప్రస్తుత వ్యాపారాలపైనై దృష్టి సారించండి. మీ నిర్లక్ష్యం వలన విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం నుండి ఒత్తిడి, చికాకులు అధికం. 
 
కన్య: ఒక విషయంలో మిత్రులపై ఉంచిన మీ నమ్మకం వమ్ము అయ్యే ఆస్కారం ఉంది. మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. రవాణా రంగాలలోని వారికి చికాకులు అధికమవుతాయి. హోల్‌సేల్ కంటే రిటైల్ వ్యాపారాలే బాగుంటాయి. గృహమునకు కావలసిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. 
 
తుల: ట్రాన్స్‌పోర్ట్, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల్లో వారికి ఒత్తిడి, చికాకులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారులకు అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగలకు ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. రిప్రజెంటేటివ్‌లకు సంతృప్తి కానవస్తుంది. వృత్తి పరమైన చికాకులు క్రమంగా తొలగిపోగలవు.
 
వృశ్చికం: ముఖ్యులతో సంభాషించేటపుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం చాలా ముఖ్యం. వైద్యులకు శస్త్రచికిత్సల సమయంలో ఏకాగ్రత చాలా అవసరం. చేపట్టిన పనుల్లో ఆటంకాలు అధికమిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు.
 
ధనస్సు: కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. స్త్రీల అనాలోచిత వ్యాఖ్యాల, చర్యలు సమస్యలకు దారితీస్తాయి. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత, ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. 
 
మకరం: ఉద్యోగస్తుల శ్రమకు గుర్తింపు లేకపోగా మాటపడవలసి వస్తుంది. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. మీరు చేసిన పనికి ప్రత్యుపకారం పొందుతారు. మీ సంతానం మెుండి వైఖరి ఇబ్బందులకు దారితీస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి.  
 
కుంభం: సమయోచితంగా నిర్ణయం తీసుకుని ఒక సమస్యను అధికమిస్తారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కుంటారు. ధనం ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ సంకల్పం నెరవేరదు. దంపతుల మధ్య దాపరిరకం అపార్థాలకు దారితీస్తుంది. ఉపాధ్యాయులకు యాజమాన్యం నుండి ఒత్తిడి పెరుగుతుంది. 
 
మీనం: ఆర్థిక విషయాల్లో ఇతరుల సలహా తీసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుండి విముక్తి లభిస్తుంది. వైద్య రంగాల వారికి మంచి గుర్తింపు, ఆదాయం లభిస్తుంది. ఒక వ్యవహారం నిమిత్తం ప్రయాణం తలపెడతారు. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుండి ఒత్తిడి అధికమవుతుంది.