బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (09:03 IST)

మంగళవారం (04-09-2018) దినఫలాలు - విపత్కర పరిస్థితులనైనా ధైర్యంగా...

మేషం: రాజకీయనాయకులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. ప్రముఖులతో ఇంటర్వ్యూలు అనుకూలించి మీ పనులు సానుకూలతమవుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ వ్యాపారులకు లాభదాయకం. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల

మేషం: రాజకీయనాయకులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. ప్రముఖులతో ఇంటర్వ్యూలు అనుకూలించి మీ పనులు సానుకూలతమవుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ వ్యాపారులకు లాభదాయకం. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ తొందరపాటు తనం వలన వ్యవహారంల బెడిసికొట్టే ఆస్కారం ఉంది.
 
వృషభం: వస్త్ర, బంగారం, వెండి, గృహోపకరణాల వ్యాపారులకు పురోభివృద్ధి. స్త్రీలకు చుట్టు పక్కల వారితో సమస్యలు అధికమవుతాయి. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటపుడు ఆత్మనిగ్రహం వహించడం మంచిది. ఖర్చు మీ అంచనాలకు విరుద్ధంగా ఉంటాయి. ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కుంటారు. 
 
మిధునం: రచయితలకు, కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుది. ప్రేమికుల మధ్య అపోహలు తొలగిపోగలవు. బ్యాంకింగ్, ఫైనాన్స్, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. ఒక విషయంలో అయిన వారే మిమ్ములను తప్పుపడుతారు. 
 
కర్కాటకం: నిరుద్యోగులకు ఒక ప్రకటన ఎంతో ఆసక్తి కలిగిస్తుంది. సాహన ప్రయత్నాలు విరమించండి. స్థిరచరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. సన్నిహితులతో మార్పు మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. దైవ కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. రవాణా రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. 
 
సింహం: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వృత్తుల్లో వారికి సమీప వ్యక్తుల సహకారం వలన అభివృద్ధి కానవస్తుంది. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. 
 
కన్య: మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. విద్యా, వైజ్ఞానికి విషయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. రాజకీయాల్లో వారికి కార్యకర్తల వలన సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం వంటి చికాకులు తప్పవు. వైద్యులకు ఒత్తిడి, ఆడిటర్లకు ఆటంకాలు వంటివి అధికమవుతాయి.   
 
తుల: పెద్దలతోను, ప్రముఖులతోను సంప్రదింపులలో సంతృప్తి కానరాగలదు. ముఖ్యులను కలుసుకున్నా కార్యం నెరవేరదు. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొని అందరినీ ఆకట్టుకుంటారు. చిరకాలవు సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మీ మాటకు కుటుంబలోను, సంఘంలోను విలువ పెరుగుతుంది. 
 
వృశ్చికం: పత్రికా, మీడియా రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు పనిభారం వలన ఆరోగ్యం మందగిస్తుంది. ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు. దైవా, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల వలన చికాకులు అధికమవుతాయి.   
 
ధనస్సు: అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. వాణిజ్య రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. విద్యార్థులు తోటివారి కారణంగా ఇబ్బందులు ఎదుర్కుంటారు. ముఖ్యుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. బంధువుల రాకతో గృహంలో కొత్త ఉత్సాహం, సందడి చోటు చేసుకుంటాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం.    
 
మకరం: కొంతమంది మీకు ధన సహాయం అర్ధించవచ్చు. సిమెంట్, ఇటుక, కలప వ్యాపారస్తులకు పురోభివృద్ధి. భాగస్వామిక చర్చలు, స్థిరచరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు వాయిదా పడుతాయి. సన్నిహితులలో మార్పు మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
కుంభం: మీ లక్ష్య సాధనకు నిరంతర కృషి అవసరం. కుటుంబీకుల ఆరోగ్యంలో సంతృప్తి కానరాదు. విద్యార్థులకు స్నేహ బృందాలు విస్తరిస్తాయి. లిటిగేషన్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. చేపట్టిన పనులు సకాలంలో సంతృప్తికరంగా పూర్తిచేస్తారు. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచడం మంచిది. 
 
మీనం: స్టాక్ మార్కెట్ రంగాలవారికి నిరుత్సాహం తప్పదు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కుంటారు. మీ ఆశయాలకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధాలు బలపడుతాయి. అందరికి సహాయం చేసి సమస్యలు ఎదుర్కుంటారు. రుణం ఏ కొంతైనా తీర్చడానికి చేసే మీ యత్నం వాయిదా పడుతుంది.