మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : శుక్రవారం, 31 ఆగస్టు 2018 (08:32 IST)

శుక్రవారం (31-08-2018) దినఫలాలు - పట్టుదలతో శ్రమించి మీరు అనుకున్నది...

మేషం: వృత్తి వ్యాపారాలలో గణనీయమైన మార్పులు కానవస్తాయి. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిది కాదు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాట

మేషం: వృత్తి వ్యాపారాలలో గణనీయమైన మార్పులు కానవస్తాయి. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిది కాదు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. స్త్రీలకు పనివారలతో సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి.
 
వృషభం: పుణ్యక్షేత్రాల దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. స్త్రీలకు పనివారలతో సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు.
 
మిధునం: ఉద్యోగ, వ్యాపారాల్లో స్వల్ప ఆటుపోట్లు ఎదుర్కోవలసి వస్తుంది. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ వాహనం ఇతరులకు ఇవ్వడం వలన ఇబ్బందులకు గురికాక తప్పదు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాలవారికి ఆశాజనకం. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. 
 
కర్కాటకం: ఆకస్మిక ఖర్చులు, సమయానికి ధనం సర్దుబాటు కాకపోవడం వలన ఒకింత ఇబ్బందులు తప్పవు. దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్లీడర్లకు తమ క్లయింట్‌లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. పాతమిత్రుల కలయిక మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. 
 
సింహం: ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. 
 
కన్య: బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. ఇతరులతో అతిగా మాట్లాడడం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చును. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఆలస్యంగానైనా అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి అధికమవుతుంది.  
 
తుల: ఒకే అభిరుచి కలిగిన వ్యక్తుల కలయిక జరుగును. ఖర్చులు సామాన్యంగా ఉంటాయి. ప్రముఖుల కలయికతో కొన్ని పనులు అనుకూలిస్తాయి. విద్యుత్ రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. నిరుద్యోగులు ఊహగానాలతో కాలం వ్యర్థం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోండి. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం. 
 
వృశ్చికం: ఇతరులకు పెద్ద మెుత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌకికం ఎంతో అవసరం. వ్యాపారాల్లో ఒక దానిలో వచ్చిన నష్టం మరొక విధంగా భర్తీ అవుతుంది. ఉద్యోగస్తులు విలువైన కానుకలు ఇచ్చి అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరద్యోగులకు సదవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోలేకపోతారు.
 
ధనస్సు: ప్రింటింగ్ రంగాలలో వారు పై అధికారుల చేత మాటపడక తప్పదు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ అధికారులతో విబేధాలు తలెత్తుతాయి. మీరు కోరుకున్న రంగంలో విజయం సాధించాలి అంచే మిత్రుల సలహాను పాటించండి. 
 
మకరం: వ్యాపారాల్లో ఒక దానిలో వచ్చిన నష్టం మరొక విధంగా భర్తీ అవుతుంది. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. ఉపాధ్యాయులకు విద్యార్థుల వలన ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వీలైనంత వరకు బయటి ఆహారాన్ని భుజించకండి. ఇతరులకు హామీలు ఇవ్వడం వలన ఇబ్బందులు ఎదుర్కుంటారు. 
 
కుంభం: వృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా ఆశించినంత ప్రతిఫలం లభించదు. ఓర్పు, పట్టుదలతో శ్రమించి మీరు అనుకున్నది సాధిస్తారు. ప్రయాణాలు అనుకూలం. గతంలో నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. రావలసిన ధనం కొంత మెుత్తం అందుకుంటారు.
 
మీనం: నిరుద్యోగుల ఆలోచనలు ఉపాధి పథకాల దిశగా కొనసాగుతాయి. ప్రేమికుల మధ్య విబేధాలు తలెత్తుతాయి. ఉపాధ్యాయులకు శ్రమాధిక్యత తప్పదు. ఉద్యోగంలో అదనపు బరువు, బాధ్యతలు పెరుగుతాయి. క్యాటరింగ్ పనివారలకు సామాన్యంగా ఉంటుంది. కాంట్రాక్టర్లకు ఏకాగ్రత, స్వయం పర్యవేక్షణ ఎంతో ముఖ్యం.