శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : మంగళవారం, 28 ఆగస్టు 2018 (08:35 IST)

మంగళవారం (28-08-2018) దినఫలాలు - ఆధ్యాత్మిక చింతన...

మేషం: స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల విషయంలోను అప్రమత్తత అవసరం. ప్రేమికులకు పెద్దల నుండి వ్యతిరేకత, ఆంక్షలు తప్పవు. సభ, సన్మానాలలో చురుకుగా పాల్గొంటారు. ఒప్పందాలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవ

మేషం: స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల విషయంలోను అప్రమత్తత అవసరం. ప్రేమికులకు పెద్దల నుండి వ్యతిరేకత, ఆంక్షలు తప్పవు. సభ, సన్మానాలలో చురుకుగా పాల్గొంటారు. ఒప్పందాలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. దంపతుల ఆలోచనలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి.
 
వృషభం: స్త్రీలకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. అపరిచిత వ్యక్తులతో అధికంగా సంభాషించడం మంచిది కాదు. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. విద్యార్థులు అల్లర్లు, ఆందోళనలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. వ్యాపారాల్లోఅమలు చేసిన పథకాలు మునుముందు మంచి ఫలితాలిస్తాయి.  
 
మిధునం: ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల వలన చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గృహోపకరణాలు అమర్చుకుంటారు. మీ తొందరపాటు నిర్ణయాల వలన కష్టనష్టాలు, ఇబ్బందులు తప్పవు. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. 
 
కర్కాటకం: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం శ్రేయస్కరం. స్థోమతకు మించిన వాగ్దానాల వలన ఇబ్బందులెదుర్కుంటారు. కుటుంబీకుల మధ్య అవగాహన, ఏకాభిప్రాయం సానుకూలమవుతాయి. గత తప్పిదాలు పునరాతృతమయ్యే సూచనలున్నాయి. సమయస్పూర్తితో ఒక సమస్యను అధిగమిస్తారు. 
 
సింహం: ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం. నిరుద్యోగులు ఏ చిన్న అవకాశమైన సద్వినియోగం చేసుకోవడం మంచిది. స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడి వలన ఆందోళనలకు గురవుతారు. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ యత్నం నెరవేరగలదు.  
 
కన్య: అందరికి సహాయం చేసి మాడపడతారు. పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించండి. మీ వాహానం ఇతరులకిచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఫైనాన్స్, వ్యాపారులు మెుండి బాకీల మీద దృష్టి ఉంచండి. మీతో సఖ్యత నటిస్తూనే తప్పుదారి పట్టించేందుకు కొంతమంది యత్నిస్తారు. 
 
తుల: ఆర్థిక విషయాల్లో ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తారు. కాంట్రాక్టర్లకు అధికారుల నండి అభ్యంతరాలెదుర్కోవలసి వస్తుంది. ఖర్చులు ఊహించినవే కావడంతో మీ అవసరాలకు కావలసిన ధనం ముందుగానే సిద్ధం చేసుకుంటారు. మీ మతిమరుపు ఇబ్బందులకు దారితీస్తుంది. కొన్ని నచ్చని సంఘటనలెదురైనా భరించక తప్పదు. 
 
వృశ్చికం: సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ప్లీడర్లకు తమ క్లయింట్‌లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. వాణిజ్య ఒప్పందాలు, బ్యాంకు చెక్కులు వచ్చే విషయంలో ఏకాగ్రత అవసరం. పట్టు విడుపు ధోరణితో కొన్ని సమస్యలు పరిష్కారం కాగలవు. 
 
ధనస్సు: స్థిరాస్తుల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. హోటల్, క్యాటరింగ్ రంగాల్లోవారి పనివారితో ఇబ్బందులు ఎదుర్కుంటారు. స్త్రీల పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు సమస్యలు తలెత్తుతాయి. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు.
 
మకరం: స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత అవసరం. కొత్త షేర్ల కొనుగోళ్ళలో పునరాలోచన అవసరం. ఆరోగ్యంలో ఆందోళన తప్పదు. కాంట్రాక్టు దారులకు ఆందోళనలు కొన్ని సందర్భములందు ధననష్టమం సంభవించును. ప్రయాణాల్లో తొందరపాటుతనం వలన అంత మంచిది కాదని గమనించండి.   
 
కుంభం: ఉపాధ్యాయులకు విద్యార్థుల వలన సమస్యలు తలెత్త ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. మిత్రుల కోసం షాపింగ్ చేస్తారు. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొరవ ఉండదు. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. కుటుంబ సమస్యల నుండి బయటపడుతారు.
 
మీనం: ఉద్యోగస్తులు, రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. మాట్లాడలేని చోట మౌనం వహించడం మంచిది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి.