ఆదివారం, 12 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Updated : శనివారం, 25 ఆగస్టు 2018 (09:22 IST)

25-08-2018 - శనివారం మీ రాశి ఫలితాలు.. కష్టపడి పనిచేస్తే డబ్బు దానంతట...?

మేషం: కంది, మినుము, మిర్చి వ్యాపారస్తులకు పురోభివృద్ధి. రవాణా రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోని వారికి ఒత్తిడ, చికాకులు అధికమవుతాయి. విద్యార్థులు తొందరపాటు నిర్ణయాల వలన

మేషం: కంది, మినుము, మిర్చి వ్యాపారస్తులకు పురోభివృద్ధి. రవాణా రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోని వారికి ఒత్తిడ, చికాకులు అధికమవుతాయి. విద్యార్థులు తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. బంధుమిత్రుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. 
 
వృషభం: మీ అభిప్రాయాలు, ఆలోచనలకు మిశ్రమ స్పందన పొందుతారు. ఒకేసారి అనేక పనులు మీదపడడంతో ఒత్తిడికి గురవుతారు. ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాలవారికి ఆశాజనకం. ప్రైవేటు సంస్థలలోని వారు నిగ్రహంతో వ్యవహరించాలి. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు.
 
మిధునం: కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాల్లో గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. అప్రయత్నంగా కొన్ని వ్యవహారాలు పరిష్కారమవుతాయి. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ రంగాలవారికి సదవకాశాలు లభిస్తాయి. 
 
కర్కాటకం: వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లు విజయం సాధిస్తారు. స్త్రీలకు టీ. వీ ఛానెళ్ల నుండి ఆహ్వానం, పారితోషికం, బహుమతులు అందుతాయి. ఖర్చులకు సరిపడు ఆదాయం సమకూర్చుకుంటారు. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
సింహం: వ్యవసాయ రంగాలవారికి ఎరువులు, క్రిమి సంహారక మందుల కొనుగోళ్లో చికాకులు, ఇబ్బందులు తప్పవు. స్త్రీలు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. మీ యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం, సహకారం అందిస్తారు. రచయితలకు, పత్రికా రంగంలో వారికి కీర్తి, గౌరవాలు పెరుగుతాయి. 
 
కన్య: వ్యాపారాల్లో నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కుంటారు. బంధుమిత్రులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. ప్రేమానుబంధాలు బలపడుతాయి. రాజకీయాల్లో వారికి తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కుంటారు. 
 
తుల: ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు చక్కగా పరిష్కరిస్తారు. కొత్త పరిచయాల వలన కార్యక్రమాలు విస్తృతమవుతాయి. స్వయంకృషితో రాణిస్తారన్న విషయం గ్రహించండి. పాత వస్తువులను కొని ఇబ్బందులు తెచ్చుకోకండి. గృహ నిర్మాణాలలో స్వల్ప అడ్డంకాలు, చికాకులు ఎదుర్కుంటారు. టెండర్లు చేజిక్కించుకుంటారు. 
 
వృశ్చికం: హోటల్, తినుబండా వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలలో మెళకువ అవసరం. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. మధ్య మధ్య ఔషధ సేవ తప్పదు. క్రీడా, కళా రంగాల్లో వారికి సంతృప్తి కానరాదు. 
 
ధనస్సు: కష్టపడి పనిచేస్తే డబ్బు దానంతటదే వస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. స్త్రీలు, దైవ, పుణ్య, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ, ఆల్కహాల్ వ్యాపారస్తులకు ఆశాజనకం.
 
మకరం: విదేశాలకు వెళ్ళటానికి చేయు యత్నాలు వాయిదాపడుతాయి. మీరు ఓ స్నేహితునితో కలిసి మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం వలన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. 
 
కుంభం: నిరుద్యోగులు బోగస్ ప్రకటనలు పట్ల అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. కుటుంబీకుల కోసం నూతన పథకాలు వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. గృహోపకరణాలు సమకూర్చుకుంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
మీనం: తలపెట్టిన పనుల్లో ప్రోత్సాహం, పురోభివృద్ధి కానవస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. ఖర్చులు అంతగా లేకున్నా ఆర్థిక సంతృప్తి అంతగా ఉండదు. ఆరోగ్య, ఆహార వ్యవహారాలలో మెళకువ వహించండి. స్త్రీలు కుటుంబ సౌఖ్యం, మానసిక ప్రశాంతత పొందుతారు. గత విషయాలు జ్ఞాప్తికి రాగలవు.