మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : శుక్రవారం, 24 ఆగస్టు 2018 (08:32 IST)

శుక్రవారం (24-08-2018) దినఫలాలు - వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఆశించిన..

మేషం: ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. బాకీలు, ఇతరత్ర రావలసిన ఆదాయాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. యత్నాలకు కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. బంధుమిత్రులతో

మేషం: ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. బాకీలు, ఇతరత్ర రావలసిన ఆదాయాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. యత్నాలకు కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. కోర్టు వ్యవహారాలు వాయిదా కోరుకోవడం శ్రేయస్కరం.
 
వృషభం: స్త్రీలు కళాత్మక పోటీల పట్ల ఆసక్తి చూపిస్తారు. ట్రాన్స్‌పోర్ట్, ఎక్స్‌పోర్ట్, ఆటోమెుబైల్ రంగాలవారికి చికాకులు తప్పవు. మీ శ్రీమతికోసం ధనం బాగా వ్యయం చేస్తారు. ఉద్యోగులు పదోన్నతి, స్థానమార్పిడి యత్నాలలో సఫలీకృతులవుతారు. సంఘంలో పలుకుబడికలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది. 
 
మిధునం: ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా దూరప్రయాణం చేయవలసి వస్తుంది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. వ్యాపారాలను సమర్థంగా నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఆశించిన మార్పులుంటాయి. స్త్రీలకు కళ్లు, నరాలు, దంతాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. 
 
కర్కాటకం: ఆర్థిక సమస్యల నుండి బయటపడుతారు. ముఖ్యమైన వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ప్రయాణ రీత్య ధనవ్యాయం మానసిక ప్రశాంతత కరువగును. రాజకీయ, కళా రంగాల్లో వారికి కలిగిరాగలదు. నిత్యవసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు కలిగిరాగలదు. శత్రువులపై విజయం సాధిస్తారు.
 
సింహం: ఆకస్మిక ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. వ్యాపారాల్లో పోటీని దీటుగా ఎదుర్కుంటారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. ప్రియతములతో సంబంధ భాంధవ్యాలు బాగుగా ఉంటాయి.
 
కన్య: ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం వలన పై అధికారులతో సంభాషించేటప్పుడు మెళకువ అవసరం. స్త్రీలు ఉద్యోగ ప్రకటనల పట్ల ఆసర్షితులవుతారు. విద్యార్థుల అత్యుత్సాహం విపరీతాలకు దారితీసే ఆస్కారం ఉంది. బంధువుల మధ్య సయోధ్య నెలకొంటుంది. కొత్తగా ప్రారంభించిన వ్యాపారాలు ప్రగతి పథంలో సాగుతాయి. 
 
తుల: కోర్టు వ్యవహారాలు వాయిదా కోరుకోవడం శ్రేయస్కరం. లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రక్టర్లు, వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరవుతారు. మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో ఆటంకాలు ఎదుర్కుంటారు. 
 
వృశ్చికం: హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు కలిసిరాగలదు. ఉపాధ్యాయుల శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ ఆంతరంగిక విషయాలు, పథకాలు గోప్యంగా ఉంచండి. కుటుంబీకుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. వివాహ, ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి.  
 
ధనస్సు: ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తినిస్తాయి. స్త్రీల ఓర్పు, ఏకాగ్రతలకు ఇది పరీక్షా సమయం. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం, విరక్తి కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. 
 
మకరం: సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. రిప్రజెంటేటివ్‌లకు, ఉపాధ్యాయులకు ఒత్తిడి పెరుగుతుంది. మీ మాటలు కొంతమంది వక్రీకరించే ఆస్కారం ఉంది. విద్యార్థినులకు పాఠ్యాంశాల కంటె ఇతర వ్యాపకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వైద్య, ఇంజనీరింగ్, శాస్త్ర రంగాలవారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు.
 
కుంభం: పుణ్యక్షేత్రాల దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. తల, కాళ్లు, చేతులు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. రాజకీయాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి కానవస్తుంది. నూతన పరిచయాలేర్పడతాయి. 
 
మీనం: దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు పనివారలతో ఇబ్బందులు తప్పవు. ప్రియతము రాక సమాచారం మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. పత్రిక, ప్రైవేటు సంస్థల్లోని వారికి ఓర్పు అవసరం. స్వశక్తితో పైకొచ్చిన మీరు, మరింత ముందు కెళ్లాలంటే తగిన సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది.