1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Uttarakhand crime news

ఉత్తరాఖండ్.. మరిది ముందే వివాహితపై సామూహిక అత్యాచారం..

crime
ఉత్తరాఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ వివాహితపై ముగ్గురు కామాంధులు తుపాకీతో బెదిరించి.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. చివరికి పోలీసులు ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఆదివారం రాత్రి గాంధీ పార్క్‌లో జరుగుతున్న సరస్ మేళా చూసి బాధితురాలు తన మరిదితో కలిసి బైక్‌పై ఇంటికి తిరిగి వస్తున్నారు. రాత్రి 9 గంటల సమయంలో కీచా బైపాస్‌లోని మోదీ మైదాన్ సమీపంలోకి రాగానే, రెండు బైక్‌లపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు వారిని అడ్డగించారు. ఆపై తుపాకీతో బెదిరించి.. మరిది కళ్ల ముందే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
నిందితులు బాధితురాలి మరిదికి తెలిసినవారేనని తెలుస్తోంది. బాధితురాలు ప్రతిఘటించడంతో ఓ నిందితుడు కత్తితో ఆమె ఎడమచేతి వేలును కోశాడు. అనంతరం, చంపేస్తామని బెదిరించి అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలు ధైర్యం చేసి రాంపురా పోలీస్ ఔట్‌పోస్ట్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని  వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులు బాధితురాలి మరిదికి పరిచయస్తులు కావడంతో, అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దర్యాప్తు జరుగుతోంది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
కుటుంబ సమస్యలు-విసిగిపోయి పిల్లలతో హుస్సేన్ సాగర్‌లో దూకేయాలనుకుంది.. చివరికి?