శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : సోమవారం, 3 సెప్టెంబరు 2018 (08:19 IST)

03-09-2018 సోమవారం దినఫలాలు - ఊహగానాలతో కాలం వ్యర్థం....

మేషం: కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల, ప్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. యోగా, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రముఖ కంపెనీల షేర్లు నష్టాల బాటలో నడుస్తాయి. వైద్య రంగాల వారికి మంచి గుర్తింపు, ఆద

మేషం: కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల, ప్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. యోగా, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రముఖ కంపెనీల షేర్లు నష్టాల బాటలో నడుస్తాయి. వైద్య రంగాల వారికి మంచి గుర్తింపు, ఆదాయం లభిస్తుంది. ఊహగానాలతో కాలం వ్యర్థం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోండి.
 
వృషభం: ప్రతి పని చేతిదాగా వచ్చి వెనక్కి పోవుటవలన ఆందోళన పెరుగుతుంది. ప్రతిఫలం తక్కువైనా వృత్తుల వారికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. విద్యార్థులు పై చదువుల కోసం దూరప్రదేశానికి వెళ్ళవలసి వస్తుంది. వాతావరణంలో మార్పు వలన స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. 
 
మిధునం: రేపటి గురించి ఆలోచనలు అధికమవుతాయి. దైవ కార్యాలకు ధనం బాగా వ్యయం చేస్తారు. ఉద్యోగస్తుల సమర్థతను అధికారులు గుర్తిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యవసాయ, తోటల రంగాల వారికి వాతావరణం అనుకూలిస్తుంది. ముఖ్యులతో కలసి పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. 
 
కర్కాటకం: శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కుంటారు. వృదా ఖర్చులు, అనుకోని చెల్లింపులు వలన ఆటుపోట్లు తప్పవు. నూతన పరిచయాలేర్పడతాయి. రాజకీయ నాయకులుకు ప్రయాణాలలో మెళకువ అవసరం. కంప్యూటర్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు.    
 
సింహం: స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఏదైనా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కొతం కాలం వాయిదా వేయడం మంచిది. ఒక స్థిరాస్తి అమర్చుకునే విధంగా మీ ఆలోచనలుంటాయి. దైవ, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. వృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా ఆదాయం ఆశించినంతగా ఉండదు. 
 
కన్య: ఆర్థిక విషయాల్లో ఇతరుల సలహా తీసుకోవడం మంచిది. కళకారులకు అభివృద్ధఇ చేకూరుతుంది. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచండి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్, శాస్త్ర రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. విద్యార్థుల ఆలోనచలు పలు విధాలుగా ఉంటాయి.  
 
తుల: మిత్రుల ప్రోత్సాహంతో నిరుద్యోగులు ఉపాధి పథకాలు చేపడుతారు. మీ సంతానం వలన ఇబ్బందులు కలిగే అవకాశాలున్నాయి జాగ్రత్త వహించండి. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం కొంత ఆలస్యంగా అందుతుంది. ముఖ్యులకో ఒకరి వైఖరి మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యాపారాభివృద్ధికి చేయు ప్రయత్నాలలో సఫలీకృతులవుతారు. 
 
వృశ్చికం: విపరీతమైన ఖర్చులు, శ్రమాధిక్యత వలన మనస్సు నిలకడగా ఉండదు. మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి ఉంటుంది. ప్రేమికుల తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. నిరుద్యోగులకు ఏకాగ్రత అవసరం. వాహన చోదకులకు ఆటంకాలు తప్పవు. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. 
 
ధనస్సు: పారిశ్రామిక రంగాలలో వారికి నూతన ఆలోచనలు స్పురించగలవు. కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారులకు కలిసిరాగలదు. ప్లీడర్లకు తమ క్లయింట్‌ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. సహకార సంస్థల్లో వారికి, ప్రైవేటు, మార్కెటింగ్ రంగాల్లో శ్రమాధిక్యత కానవస్తుంది. విద్యార్థుల ఆలోచనలు పక్కదారి పట్టవచ్చు.   
 
మకరం: దైవ, సేవా కార్యక్రమాలకు ధనం బాగా వెచ్చిస్తారు. వైద్యులకు శస్త్రచికిత్సల సమయంలో ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలించక పోవడంతో ఆందోళనకు గురవుతారు. నిరుద్యోగులకు చిన్న సదవకాశం లభించిన సద్వినియోగం చేసుకోవడం మంచిది. 
 
కుంభం: మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. మీ అగ్రహావేశాల పట్ల కుటుంబ సౌఖ్యం అంతగా ఉండదు. ఇతరులకు పెద్దమెుత్తంలో ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన అవసరం. దంపతుల మధ్య కలహాలు, ప్రశాంతత వంటి చికాకులను ఎదుర్కుంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
మీనం: మార్కెటింగ్ రంగాలవారికి ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం తప్పవు. బంధువులకు పెద్దమెుత్తం ధనం ఇచ్చే విషయంలో పునరాలోచన అవసరం. మీ కుటుంబీకులు మీ మాట తీరును వ్యతిరేకిస్తారు. మీ అభిప్రాయాన్ని ఖచ్ఛితంగా తెలియజేయడం మంచిది. పాత పరిచయస్తులను, ఆప్తులను కలుసుకుంటారు.