బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : శనివారం, 1 సెప్టెంబరు 2018 (08:56 IST)

సెప్టెంబరు 1వ తేదీ శనివారం దినఫలాలు - స్త్రీల తొందరపాటుతనం వల్ల...

మేషం: కొబ్బరి, పండ్లు, పూల చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగ ప్రయత్నం అనుకూలించడంతో మీలో నూతన ఉత్సాహం చోటు చేసుకుంటుంది. వృత్తులు, చిన్నతరహా పరిశ్రమల వారికి ఆశాజనకం. బ్యాంకుల్లో అపరిచిత వ్యక్తుల ప

మేషం: కొబ్బరి, పండ్లు, పూల చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగ ప్రయత్నం అనుకూలించడంతో మీలో నూతన ఉత్సాహం చోటు చేసుకుంటుంది. వృత్తులు, చిన్నతరహా పరిశ్రమల వారికి ఆశాజనకం. బ్యాంకుల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ వహించండి. అనవసరపు వివాదాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి.
 
వృషభం: స్త్రీల తొందరపాటుతనం వలన బంధువర్గాల నుండి మాటపడవలసి వస్తుంది. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. అనుకున్న పనులు కాస్త ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తికాగలవు. ఉద్యోగస్తులు అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. కిరాణా, ఫ్యాన్సీ, వస్త్ర, బంగారం, వెండి వ్యాపారులకు పురోభివృద్ధి. 
 
మిధునం: ఉద్యోగస్తుల సమర్థత, చాకచక్యానికి అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. పాతరుణాలు తీరుస్తారు. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో రాణిస్తారు. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేయవలసి వస్తుంది. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అనుకూలించవు. ప్రయాణాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది.   
 
కర్కాటకం: ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు వాయిదా పనులు పునఃప్రారంభిస్తారు. మార్కెటింగ్, ప్రింటింగ్ రంగాలవారికి ఆశాజనకం. దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. సన్నిహితుల నుండి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. ఖర్చులు అధికం. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు మిశ్రమ ఫలితం. 
 
సింహం: ఇతరుల విషయాలకు, వాదోపవాదలకు దూరంగా ఉండడం మంచిది. బంధుమిత్రుల రాకతో గృహంలో కొత్త వాతావరణం నెలకొంటుంది. మీ కళత్ర మెుండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఏదైనా అమ్మకానికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది.  
 
కన్య: దేవాలయ, విద్యాసంస్థలకు దానధర్మాలు చేయడం వలన మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి పై అధికారులను మెప్పిస్తారు. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి పెరుగుతుంది ప్రయాణాలలో కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు, రాతపరీక్షలలో మెళకువ అవసరం.   
 
తుల: ఆర్థిక లావాదేవీలూ వ్యాపార వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగవు. రాజకీయాల్లో వారికి ఆదరాభిమానాలు అధికమవుతాయి. ఇతరుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. నిరుద్యోగులకు ఆశాజనకం. గృహంలో మార్పులు, చేర్పులు చేస్తారు. అపనిందలు పడే పరిస్థితులున్నాయి జాగ్రత్త వహించండి. 
 
వృశ్చికం: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. సేవా, పుణ్య, కార్యాలలో మీ శ్రమకు మంచి గుర్తింపు, ఆదరణ లభిస్తుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. ముఖ్య విషయాల్లో మీ జీవిత భాగస్వామి సలహా, సహకారం తీసుకోవడం మంచిది.
 
ధనస్సు: ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం మీ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. ఉపాధ్యాయులు విద్యార్థుల నుండి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. పీచు, ఫోం, లెదర్ వ్యాపారస్తులకు ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు.  
 
మకరం: పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి, యాజమాన్యంతో ఏకీభావం కుదరదు. ఏ విషయంలోను మెుహమ్మాటాలు, ఒత్తిళ్ళకు పోకుండా ఖచ్చితంగా వ్యవహరించండి. దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. లీజు, ఏజెన్సీ, వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. కార్యసాధనలో పట్టుదల, ఓర్పు చాలా ముఖ్యమని గమనించండి. 
 
కుంభం: ఉద్యోగ రీత్యా దూరప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి. హామీలకు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. ప్రియతములతో పర్యటనలు, విందు, వినోదాలలో పాల్గింటారు. సంఘంలో మీ మాటకు గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. 
 
మీనం: వృత్తి, వ్యాపారాల్లో పురోభివృద్ధి పొందుతారు. వ్యవసాయ, తోటల రంగాల వారికి నిరాశజనకం. అనుకున్నది సాధించాలనే పట్టుదల పెరుగుతుంది. ఖర్చులు అదుపు చేయడం కష్టం. రాజకీయ కళారంగాల్లో వారు సన్మానాలు పొందుతారు. ఉద్యోగ యత్నాలు ఒక కొలిక్కి రావటంతో మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది.