శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : సోమవారం, 17 సెప్టెంబరు 2018 (08:55 IST)

17-09-2018 - సోమవారం దినఫలాలు - ఒంటెత్తు పోకడ మంచిది కాదని...

మేషం: ఉపాధ్యాయులకు, రిప్రజెంటేటి‌వ్‌లకు సదవకాశాలు లభిస్తాయి. ప్రైవేటు సంస్థల్లో వారికి ఒత్తిడి, చికాకు తప్పదు. ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. కళ, క్రీడా రంగాల వారికి మంచి గుర్తింపు, ఆదరణ లభిస్త

మేషం: ఉపాధ్యాయులకు, రిప్రజెంటేటి‌వ్‌లకు సదవకాశాలు లభిస్తాయి. ప్రైవేటు సంస్థల్లో వారికి ఒత్తిడి, చికాకు తప్పదు. ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. కళ, క్రీడా రంగాల వారికి మంచి గుర్తింపు, ఆదరణ లభిస్తుంది. విద్యార్థులు ఇతురుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి. స్పెక్యులేషన్ కలిసిరాదు.
 
వృషభం: వస్త్ర, బంగారం, ఎలక్ట్రానికల్ వస్తు వ్యాపారాలకు పురోభివృద్ధి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో అధికమైన జాగ్రత్త అవసరం. ఇతరుల ముందు మీ ఉన్నతిని చాటుకునే యత్నాలు విరమించండి. ఎల్.ఐ.సి పోస్టల్, ఇతర ఏజెంట్లకు, బ్రోకర్లకు పనిభారం అధికమవుతుంది. స్త్రీలకు పనివారలతో ఇబ్బందులు తప్పవు. 
 
మిధునం: స్థిరాస్తి వ్యవహారాలు, భాగస్వామిక ఒప్పందాలు ఒక కొలిక్కి రాగలవు. ధనవ్యయం, విరాళాలిచ్చే విషయంలో మెళకువ వహించండి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి గుర్తింపు, తోటివారి ప్రశంసలు లభిస్తాయి. స్త్రీల మాటకు వ్యతిరేకత ఎదురవుతుంది. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
కర్కాటకం: తలపెట్టిన పనులలో విఘ్నాలు, చీటికి మాటికి అసహానం ఎదుర్కుంటారు. ప్రైవేటు సంస్థలలోని వారికి తోటివారి సలహా, సహకారం లభిస్తుంది. పారిశ్రామిక రంగంలోని వారికి సామాన్యం. కొంతమంది మీ నుండి ధనసహాయం కోరవచ్చు. ముఖ్యులలో ఒకరి గురించి అప్రియమైన వార్తలు వింటారు. 
 
సింహం: శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత, ఓర్పు ఎంతో అవసరం. మీ సన్నిహితుల వైఖరి వలన విభేదాలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. సాంఘిక, సాంస్కృతిక కార్కక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగరీత్యా ప్రయాణాలు అనుకూలం. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి.  
 
కన్య: బ్యాంకింగ్, ఫైనాన్స్, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. క్రయవిక్రయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. ఒక ముఖ్య కార్యం నిమిత్తం దూరప్రయాణం చేయవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు బరువు, బాధ్యతలు అధికం కాగలవు. రుణాలు తీరుస్తారు. విద్యార్థుల మతిమరుపు పెరగడం వలన ఇబ్బందులకు గురవుతారు. 
 
తుల: మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, తిప్పట తప్పవు. బంధువులు మీ నుండి పెద్దమెుత్తంలో ధనసహాయం అర్ధిస్తారు. ఇతరుల కారణం వలన చేపట్టిన పనులు ఆకస్మికంగా వాయిదా వేయవలసి వస్తుంది. లీజు, ఏజెన్సీలకు సంబంధించిన వ్యవహారాల్లో పునరాలోచన అవసరం. సభ సమావేశాలలో పాల్గొంటారు.   
 
వృశ్చికం: ఆత్మీయులను విమర్శించుట వలన చికాకులు తప్పవు. దూరప్రయాణాలకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిర్మాణాత్మక పనుల్లో సంతృప్తికానవస్తుంది. కుటుంబంలో నెలకొన్ని అనిశ్చితలు, అశాంతి క్రమంగా తొలగిపోగలవు. స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు. ముఖ్యుల రాకపోకలు పెరుగుతాయి.  
 
ధనస్సు: ఇప్పటి వరకు విరోదులుగా ఉన్న వ్యక్తులను సుముఖం చేసుకోగలుగుతారు. ప్రైవేటు, పబ్లిక్ సంస్థల్లో వారికి ఊహించన మార్పులు సంభవిస్తాయి. పాత బిల్లులు చెల్లిస్తారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు అధికారులతో అవగాహన తోటివారితో సత్సంబంధాలు నెలకొంటాయి.  
 
మకరం: ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగస్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించడం వలన మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. క్రయవిక్రయ రంగాల్లో వారికి సామాన్యం. మీ ఆశయాలకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధాలు బలపడుతాయి. అందరికి సహాయం చేసి సమస్యలు ఎదుర్కుంటారు.  
 
కుంభం: ఇతరుల గురించి అనాలోచితంగా చేసిన వ్యాఖ్యానాలు సమస్యలకు దారితీయవచ్చు జాగ్రత్త వహించండి. ధనం విరివిగా వ్యయమైనా సార్థకత, ప్రయోజనం ఉంటాయి. స్త్రీలు సాహన కార్యాలకు దూరంగా ఉండడం మంచిది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. 
 
మీనం: రుణం కొంత మెుత్తం తీర్చడంతో ఒత్తిడి నుండి కుదుటపడుతారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. బంధుమిత్రుల రాకతో గృహంలో కొత్త వాతావరణం నెలకొంటుంది. కుటుంబీకుల ఆరోగ్యం విషయంలో ఏకాగ్రత వహించండి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది.