మేషం: పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. విద్యార్థులలో పట్టుదల, విద్యా విషయాల పట్ల ఏకాగ్రత అవసరం. మీ ప్రత్యర్ధులు వేసే పథకాలు దీటుగా ఎదుర్కుంటారు. రుణం ఏ కొంతయినా తీర్చాలనే మీ ఆలోచన వాయిదా పడుతుంది. స్త్రీలకు ప్రతి విషయంలోను ఓర్పు, విజ్ఞత ఎంతో అవసరం.
వృషభం: పత్రిక, ప్రైవేటు సంస్థల్లోని వారికి ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. దూరప్రయాణాలకై చేయు ప్రయత్నాలు వాయిదా పడుతాయి. బంధుమిత్రుల రాకపోకలుంటాయి. ఆధ్యాపకులకు పురోభివృద్ధి, విద్యార్థులు కొన్ని నిర్భందాలకు లోనవుతారు. ఇతరుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది.
మిధునం: ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాలవారికి మిశ్రమ ఫలితం. సోదరులతో స్వల్ప అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. దైవదర్శనం చేస్తారు. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనులలో పనివారలతో చికాకులు తప్పవు. స్త్రీల మనోభావాలకు, పనితనానికి మంచి గుర్తింపు, ఆదరణ లభిస్తుంది. ప్రత్యర్థులు మీ శక్తి సామర్ధ్యాలను గుర్తిస్తారు.
కర్కాటకం: ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. సహోద్యోగులతో వాగ్వివాదాలకు దిగకండి. పాత సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. నూతన ప్రదేశాలు సందర్శిస్తారు. హోటలు తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి చేకూరుతుంది. బ్యాంక్ పనులు మందకొడిగా సాగుతాయి. మీ మనసు మార్పును కోరుకుంటుంది.
సింహం: రాజకీయనాయకులు, సభలు, సమావేశాలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటార. మిత్రుల కారణంగా మీ పనులు వాయిదా వేసుకుంటారు. విదేశీ వ్యవహారాలకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. ఉద్యోగస్థులకు పై అధికారుల వలన ఒత్తిడి, చికాకులు తప్పవు. ఏదైనా అమ్మకానికి చేయు యత్నాలు ఫలిస్తాయి.
కన్య: వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఒంటరిగా ఏపని చేయడం క్షేమం కాదని గమనించండి. అదనపు బరువు బాధ్యతలను స్వీకరిస్తారు. ప్రేమికుల మధ్య అపార్ధాలు తొలగిపోతాయి. సోదరీసోదరుల తీరు ఆందోళన కలిగిస్తుంది. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిది కాదని గమనించండి.
తుల: దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ఖర్చులు పెరిగినా ఇబ్బందులుండవు. దూరప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. విద్యార్థులు కొన్ని నిర్భందాలకు లోనవుతారు. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. తలపెట్టిన పనలు అనుకున్న విధంగా సాగక విసుగు కలిగిస్తాయి.
వృశ్చికం: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం శ్రేయస్కరం. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్, శాస్త్ర రంగాలవారికి సదవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనుల్లో సంతృప్తి కానవస్తుంది. స్త్రీలకు ఆరోగ్య విషయంలో మెళకువ అవసరం. ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి.
ధనస్సు: ఇంజనీరింగు రంగాలవారికి ఊహించని సమస్యలు తలెత్తుతాయి. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు, గృహ ప్రశాంతతకు భంగం కలిగే పరిస్థితులు నెలకొంటాయి. ఆలయాలను సందర్శిస్తారు. మార్కెటింగ్, ప్రైవేటు సంస్థల్లో వారికి ఒత్తిడి, శ్రమ అధికం. నిరుద్యోగులకు దూరప్రాంతాల నుండి అవకాశాలు లభిస్తాయి.
మకరం: వ్యాపారులకు పోటీ పెరగడంతే ఆశించినంత ఆర్థిక సంతృప్తి ఉండదు. స్థానచలనానికై చేయు ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. విద్యా, వైద్య సంస్థల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు. భార్య, భర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తిన తెలివితో పరిష్కరిస్తారు. స్థిరాస్తికి సంబంధించిన చర్చలు సత్ఫలితాలనివ్వవు.
కుంభం: కోర్టు వ్యవహారాలు వాయిదా పడుతాయి. ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది. ఉద్యోగులు కార్మిక, విద్యుత్ లోపం వంటి ఇబ్బందులు ఎదుర్కోనవలసి వస్తుంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవసాయ రంగాల వారికి ఆందోళన తప్పదు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం.
మీనం: కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనగోలు చేస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధాసక్తులు కనబరుస్తారు.