సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (09:06 IST)

18-09-2018 - మంగళవారం దినఫలాలు - అనాలోచితంగా చేసిన వ్యాఖ్యానాలు...

మేషం: సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఇతరుల గురించి అనాలోచితంగా చేసిన వ్యాఖ్యానాలు సమస్యలకు దారితీయవచ్చు జాగ్రత్త వహించండి. సోదరీసోదరుల మధ్య సఖ్యతా లోపం, కలహాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ

మేషం: సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఇతరుల గురించి అనాలోచితంగా చేసిన వ్యాఖ్యానాలు సమస్యలకు దారితీయవచ్చు జాగ్రత్త వహించండి. సోదరీసోదరుల మధ్య సఖ్యతా లోపం, కలహాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగులు కార్మిక, విద్యుత్ లోపం వంటి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.
 
వృషభం: మీ శ్రీమతి ప్రోద్బలంతో కొత్త యత్నాలు మెుదలెడతారు. ఉపాధ్యాయలు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ప్రింటింగ్ రంగాలవారికి పనిభారం బాగా పెరుగుతుంది. ఏవైనా చిన్నచిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.  
 
మిధునం: పుణ్యక్షేత్రాల దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మీరు చేయని కొన్ని పనులకు మీ మీద నిందలు మోపే అవకాశం ఉంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. కుటుంబ సౌఖ్యం కొంత తగ్గుతుందనే చెప్పవచ్చు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది.  
 
కర్కాటకం: రాజకీయనాయకులకు సభలు, సత్కార్యాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటుతాయి. పీచు, ఫోం, లెదర్ వ్యాపారస్తులకు ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. రవాణా, మెకానికల్, ఆటోమెుబైల్ రంగాలవారికి పురోభివృద్ధి. స్త్రీలకు అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి.  
 
సింహం: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి కలిసి వచ్చేకాలం. సాహస ప్రయత్నాలు విరమించండి. మీరు కోరుకుంటున్న అవకాశాలను పొందే సమయం ఆసన్నమవుతుంది. ధనం ఏమాత్రం నిల్వ చేయలేకపోవడం వలన ఆందోళనకు గురవుతారు. ముఖ్యుల రాకపోకలు అధికం కావడం వలన మీ కార్యక్రమాలు వాయిదా పడగలవు. 
 
కన్య: రాజకీయనాయకుల పర్యటనల్లో ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. విద్యార్థినులకు తోటివారి కారణంగా ఇబ్బందులు తప్పవు. కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ, కూరగాయల వ్యాపారస్తులకు పురోభివృద్ధి. శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. ఆలయ సందర్శనాలతో పాటు మానసిక ప్రశాంతతను పొందుతారు. 
 
తుల: కాంట్రాక్టర్లకు పురోభివృద్ధి, చిన్నతరహా పరిశ్రమల్లో వారికి చికాకు తప్పవుద. ప్రముఖులను కలుసుకుంటారు. వైద్యులకు సత్‌కాలం. ఇంజనీరింగ్ రంగాల్లో వారికి చికాకు, ప్లీడర్లకు పురోభివృద్ధి కానవస్తుంది. రుణ విముక్తులు కావడంతో పాటు తాకట్టు వస్తువులను విడిపించుకుంటారు. తలపెట్టిన పనులు త్వరితగతిన పూర్తిచేస్తారు.  
 
వృశ్చికం: భార్య, భర్తల ఆలోచనలు, అభిప్రాయబేధాలు భిన్నంగా ఉంటాయి. ఆస్తి వివాదాలు తీరిలబ్ది పొందుతారు. వ్యాపార విస్తరణకు భాగస్వాములతో కలిసి నూతన పథకాలు రూపొందిస్తారు. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించడం వలన అస్వస్థతకు లోనవుతారు. రాజకీయ పరిచయాలు లబ్థిని చేకూరుస్తాయి.  
 
ధనస్సు: వస్త్ర, బంగారం, వెండి, లోహ వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. ఏదైనా విలువైన స్థిరాస్తి అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. నిరుద్యోగులకు అవకాశాలు కొన్ని తృటిలో తప్పిపోతాయి. మీ సంతానం ఉన్నతికోసం కొత్తకొత్త పథకాలు రూపొందిస్తారు. ముఖ్యులతో మాటపట్టింపు వచ్చే ఆస్కారం ఉంది.  
 
మకరం: కోర్టు వ్యవహారాలు వాయిడపడుట మంచిది. రాబోయే ఆదాయానికి తగినట్టుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శనచేస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహానం కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.  
 
కుంభం: ఉద్యోగస్తులు స్థానచలనానికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. గృహంలో మార్పులు, చేర్పులు మరి కొంతకాలం వాయిదా వేయడం మంచిది. దైవకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. విద్యార్థులకు ఏకాగ్రత చాలా అవసరమని గమనించండి.  
 
మీనం: కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించడం వలన అస్వస్థతకు లోనవుతారు. రాబోయే ఆదాయానికి తగినట్టుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. పుణ్యక్షేత్రాల సందర్శన చేస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహానం కలిగిస్తాయి.