సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : సోమవారం, 24 సెప్టెంబరు 2018 (08:54 IST)

24-09-2018 - సోమవారం దినఫలాలు - అవివాహితులకు కోరుకున్న..

మేషం: బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ, ఉన్నత విద్యా యత్నాల్లో పురోగతి కనిపిస్తుంది. స్త్రీలకు ప్రతి విషయంలోను ఓర్పు, లౌక్యం అవసరం. కోర్టు, ఆస్తికి సంబంధించ

మేషం: బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ, ఉన్నత విద్యా యత్నాల్లో పురోగతి కనిపిస్తుంది. స్త్రీలకు ప్రతి విషయంలోను ఓర్పు, లౌక్యం అవసరం. కోర్టు, ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారదిశగా సాగుతాయి. స్పెక్యులేషన్ లాభదాయకంగా ఉంటుంది.
 
వృషభం: స్త్రీలకు బంధు వర్గాలతో పట్టింపులు, వ్యతిరేకత తప్పవు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యుల ఆహ్వానాలు మిమ్మల్ని సందిగ్ధానికి గురిచేస్తాయి. ఉద్యోగులకు అత్యుత్సాహం తగదు. దీర్ఘకాలిక రుణాలు ఒక కొలిక్కి చేరుతాయి. వృత్తులు, క్యాటరింగ్ రంగాల్లో వారికి ఆశాజనకం. ఆరోగ్యం సంతృప్తి కానరాదు.  
 
మిధునం: ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఆత్మీయుల సాయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. మీ సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వ్యాపారాల్లో పోటీని ధీటుగా ఎదుర్కుంటారు. నిర్మాణ పనుల్లో ఏకాగ్రత అవసరం. ప్రభుత్వ రంగాల్లో వారికి ఒత్తిడి అధికం.  
 
కర్కాటకం: దూరప్రయాణాలు అనుకూలం. వృత్తి, వ్యాపారాల్లో పురోభివృద్ధి కానరాగలదు. మీ కుటుంబీకుల ఆరోగ్యం విషయంలో మెళకువ అవసరం. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. గృహంలో మార్పులు, చేర్పులు చేస్తారు. కోర్టు వ్యవహారాలు, వారసత్వ సంప్రదింపులు ఒక కొలిక్కి వస్తాయి.   
 
సింహం: బంధువుల రాకపోకలు మీకు శుభసూచకమవుతాయి. ప్రయాణాల్లో మెళకువ అవసరం. ఖర్చులు పెరిగినా ప్రయోజనకరంగా ఉండగలవు. ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి సామాన్యం. క్రీడా, కళా, శాస్త్ర రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. అవివాహితులకు కోరుకున్న సంబంధం నిశ్చయం కాగలదు.  
 
కన్య: ఓర్పు, పట్టుదలతో శ్రమించి మీరు అనుకున్నది సాధిస్తారు. ముఖ్యుల నుండి అందుకున్న ఆహ్వానాలు సంతోషపరుస్తాయి. క్రయవిక్రయాల్లో మెళకువ అవసరం. పెద్దలను, ప్రముఖులను కలుసుకుంటారు. రావలసిన ధనం వసూలు విషయంలో జాప్యం తప్పదు. విద్యార్థులు ఉన్నత విద్యల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి.     
 
తుల: బంధుమిత్రుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. దైవదర్శనాలు, దూరప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబీకుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. ధనం ఖర్చుచేసే వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి. నిరుద్యోగులకు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగం లభించే ఆస్కారం ఉంది. 
 
వృశ్చికం: కుటుంబీకుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. చేతివృత్తులు, చిన్నతరహా వ్యాపారులకు కలిసిరాగలదు. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కోర్టువ్యవహారాలు ఒక కొలిక్కి రాగలవు. దూరప్రయాణాలు అనుకూలం. ముఖ్యుల సలహా పాటిస్తారు. అనుకోని చెల్లింపుల వలన ఒకింత ఇబ్బందులు తప్పవు.    
 
ధనస్సు: విద్యార్థులకు క్రీడా, కళా రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. సమయానికి చేతిలో ధనం లేక ఇబ్బందులెదుర్కుంటారు. బంధువర్గాలు, సన్నిహితుల నుండి ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగుల యత్నాలు కలిసిరాగలవు. దైవకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్పెక్యులేషన్ లాభించకపోవచ్చు.   
 
మకరం: ఆడంబరాలకు, విలాసాలకు ధనం విరివిగా వ్యయం చేస్తారు. నూతన వ్యాపారాలు ప్రగతి పథంలో సాగుతాయి. పెద్దల మాట పెడచెవిన పెట్టి ఇబ్బందులకు గురికాకండి. దూరప్రయాణాలు, తీర్థయాత్రలు అనుకూలిస్తాయి. ఉపాధ్యాయులకు గుర్తింపు లభిస్తుంది. వైద్యులకు సమస్యలు, ప్లీడర్లకు ప్రోత్సాహం కానవస్తుంది.  
 
కుంభం: స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలు, ప్రయత్నాలు ఉంటాయి. ఆరోగ్యంలో చికాకులు తప్పవు. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. పర్మిట్లు, లెైసెన్సుల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. నిరుత్సాహపడవద్దు. పట్టుదలతో యత్నాలు సాగించండి. కిరాణా, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది.   
 
మీనం: చెడు అలవాట్లకు, స్నేహాలకు దూరంగా ఉండడం మంచిది. నిత్యవసర వస్తువ్యాపారులకు స్టాకిస్టులకు కలిసిరాగలదు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. రావలసిన ధనం విషయంలో జాప్యం తప్పదు. స్త్రీలు మెుండివైఖరి అవలంభించడం వలన మాటపడవలసి వస్తుంది. తీర్థయాత్రలు అనుకూలిస్తాయి.