సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (15:43 IST)

కేసీఆర్ తీరు... కట్టుకున్న పెళ్లాన్ని మరొకరి వద్దకు పంపుతున్నట్టుగా ఉంది.. : కొండా సురేఖ

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర్ రావుపై మాజీ మంత్రి, ఆ పార్టీకి రాజీనామా చేసిన కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం కేసీఆర్ వైఖరి చూస్తుంటే కట్టుకున్న భార్యతో కొంతకాలం కాపురం చేసి..

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర్ రావుపై మాజీ మంత్రి, ఆ పార్టీకి రాజీనామా చేసిన కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం కేసీఆర్ వైఖరి చూస్తుంటే కట్టుకున్న భార్యతో కొంతకాలం కాపురం చేసి.. ఆ తర్వాత మరొకరివద్దకు పంపించినట్టుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
 
తెరాసకు రాజీనామా చేసిన తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ సారథిగా, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన నేతగా కేసీఆర్ అంటే తనకు గౌరవం ఉందన్నారు. కానీ, కేసీఆర్ ప్రస్తుత చేష్టలు చూస్తుంటే కట్టుకున్న భార్యతో కొంతకాలం కాపురం చేసి తర్వాత మరొకరి వద్దకు పంపించినట్టుగా ఉందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ఐదేళ్ళపాటు పరిపాలించమని ప్రజలు అధికారమిచ్చారన్నారు. కానీ, ఆయన ప్రజలు ఇచ్చిన అధికారాన్ని మధ్యలోనే వదిలేయడం భార్యను వదిలించుకోవడం వంటిదేనని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ కేసీఆర్ చర్యలను ఖండిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు ముందస్తుకు వెళుతున్నట్టు చెబుతున్న కేసీఆర్‌ను సొంత పార్టీ నేతలే విశ్వసించడం లేదని కొండా సురేఖ జోస్యం చెప్పారు.