గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 15 నవంబరు 2021 (09:46 IST)

మన ప్రయత్నాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు - రామ్ అసుర్ ప్రీరిలీజ్‌లో మారుతి

Ram Asur prerelease
అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని సాల్మాన్‌‌, శెర్రి అగర్వాల్  నటీనటులుగా రూపొందిన చిత్రం `పీనట్ డైమండ్‌`. వెంక‌టేష్ త్రిప‌ర్ణ దర్శకత్వంలో అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ  సంయుక్తంగా కలసి నిర్మించారు.  ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రకావాలని ఈ చిత్ర టైటిల్ ను `రామ్ అసుర్`గా మార్చడమైనది. 
 
ఈ చిత్రంలోని పాటను హీరో సుధీర్ బాబు రిలీజ్ చేయగా ఆ పాటకు విశేష స్పందన లభించింది.అలాగే  ఈ చిత్ర ట్రైలర్ ని ప్రముఖ దర్శకుడు క్రిష్ రిలీజ్ చేశారు. ఈ సినిమా టీజర్ ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్రిలీజ్ చేయడం విశేషం .సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి జె. ప్ర‌భాక‌రరెడ్డి ఛాయాగ్ర‌హ‌కుడిగా వ్య‌వ‌హ‌ రిస్తున్నారు. ప్రేక్షకులలో మంచి క్రేజ్ ను దక్కించుకున్న ఈ సినిమాకి `బెంగాల్ టైగ‌ర్` ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమ కూరుస్తున్నారు.ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా సినిమా పై కూడా మంచి అంచనాలు పెంచాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న `రామ్ అసుర్` చిత్రం ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 19 న ఎంతో గ్రాండ్ గా థియేటర్స్‌లో రిలీజ్ కాబోతుంది.
 
ఈ సందర్భంగా ఈ చిత్రం ప్రి రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం హైదరాబాద్ లో జ‌రిగింది. దర్శకుడు మారుతి ప్రి రీలీజ్ ట్రైలర్ ను విడుదల చేయగా, దర్శకుడు బుచ్చి బాబు "ఎం చేశావే మాయ మాయ"సాంగ్ ను లాంచ్ చేశారు. అనంతరం "రామ్ అసుర్" మొదటి బిగ్ టికెట్ ను దర్శకులు మారుతి,నిర్మాత బెల్లంకొండ సురేష్ లు విడుదల చేసి ఫస్ట్ టికెట్స్ ను కొనుగోలు చేశారు.
 
దర్శకుడు మారుతి మాట్లాడుతూ* ..వెంకటేస్ మా బ్యానర్ లోని ఈ రోజుల్లో సినిమాకి పని చేశాడు అప్పుడు కూడా తను కథ చెప్పడానికి ట్రై చేసే వాడు. అప్పుడే తను మంచి దర్శకుడు అవుతాడను కొన్నాను. ఆ తర్వాత చెన్నైలో వర్క్ చేసి వచ్చి నాకు ఒక కథ చెప్పాడు నీలో మంచి డైరెక్టర్ వున్నాడు చేయమని సపోర్ట్ చేశాను.ఆ తర్వాత ఈ సినిమా ట్రైలర్ తీసుకువచ్చి నాకు చూపించాడు.చిత్ర ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది.మనము తీసిన సినిమాను ఆడియన్స్ డిసైడ్ చేస్తారు మన ప్రయత్నాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు తను చేసిన ఈ మొదటి ప్రయత్నంమే ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ దాక తీసుకువచ్చాడు అంటే తన వెనక ఎంత కష్టం ఉంతుందో నాకు తెలుసు.డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఇప్పటి వరకూ ఇటువంటి కాన్సెప్ట్ సినిమా రాలేదు.మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుంది అన్నారు 
 
చిత్ర దర్శక, నిర్మాత వెంక‌టేష్ త్రిప‌ర్ణ మాట్లాడుతూ,  జీవితంలో నన్ను ప్రభావితం చేసిన వ్యక్తులు ఇద్దరు వారిలో మొదటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. రెండో వ్యక్తి దర్శకుడు మారుతి. ఆయ‌న దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. చిన్న బడ్జెట్ లో కూడా ఈరోజుల్లో వంటి  సినిమా తీసి హిట్ కొట్టవచ్చు అని నిరూపించారు. మారుతి గారు అలాగే  పెద్ద బడ్జెట్లో ఎక్కువ స్పాన్ తీసుకొని పెద్ద సినిమా తీసి హిట్ కొట్టచ్చు అని  అలాగే ఒక చిన్న లిమిటెడ్ బడ్జెట్ లో తక్కువ వర్కింగ్ డేస్ లో కూడా చేసి విజయం సాధించచ్చు అని నిరూపించారు. 
 
ఇ ఈ సినిమాలో లవ్ స్టోరీ కూడా ఉంటుంది. మేము చాలా విషయాలు రివీల్ చెయ్య కూడదు కాబట్టి మేము ట్రైలర్లో చూపించలేదు ప్రతి 15 నిమిషాలకు ఒక ట్విస్ట్ ఉంటుంది అది ఏంది అన్నది సినిమా చూస్తే తెలుస్తోంది.అభినవ్ సర్దార్ చాలా చాలా అద్భుతంగా నటించాడు ఈ చిత్రంలోని విజువల్స్ ప్రత్యేకంగా ఉంటాయి కాబట్టి థియేటర్లో చూసిన ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని ఈ సినిమాను ఓటిటి లో కాకుండా థియేటర్స్  లలో నవంబర్ 19న విడుదల చేయడానికి  చేస్తున్నామని అన్నారు.
 
చిత్ర హీరో, నిర్మాత అభిన‌వ్ స‌ర్ధార్‌ మాట్లాడుతూ, మా ఇద్ద‌రు అన్న‌లు నాకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి సరైన దారిలో వెళ్లేలా తీసుకొచ్చి నన్ను నిల్చోబెట్టారు. ఈ సినిమా విషయానికి వస్తే  ఇంతముందు సినిమాల్లాగా ఈ సినిమా ఉండదు. జనరల్ గా వస్తున్న సినిమాలన్నీ కూడా లవ్ స్టొరీ ని యాక్షన్ స్టోరీలలో వుండే కథనే బేస్ గా తీసుకొని న్యూ ప్యాకేజ్డ్ సినిమా తీస్తారు. అయితే అట్టి సినిమాలు చూస్తున్నపుడు అందులోని  సీన్స్ వచ్చినపుడు వేరే సినిమాలో ఈ సీన్స్, కథను కాపీ చేశారు అని అంటుంటారు.అయితే ఈ చిత్రంలోని కంటెంట్ మాత్రం ఏ సినిమాకు కాపీ గా ఉండదు. ఇందులో ఉన్న పాయింట్ ను ఇప్పటివరకు హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ లోగానీ ఎవరు టచ్ చేయలేదు.కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది
 
చిన్న బడ్జెట్ అని మొదలు పెట్టి ఓటిటి లో,  యూట్యూబ్ లో రిలీజ్ చేద్దాం అనుకున్నాము. కాన్సెప్ట్ కొత్తగా ఉండడంతో మేము అనుకున్న బడ్జెట్ కి 100 టైమ్స్ పెరిగింది. సినిమా బడ్జెట్ పెరగడంతో నా సైనిక్ స్కూల్ బ్యాచ్ మేట్స్ కు  ఫోన్ చేసి నేను చేసే సినిమాకు కో ప్రొడ్యూసర్ గా వుంటూ మాకు సపోర్టు చేయమంటే ముందుకు వచ్చారు. అలాగే నా ఫ్రెండు నిధి కూడా నాకు చాలా హెల్ప్ చేసింది.ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమాను మేము అనుకున్న  టార్గెట్ సెగ్మెంట్లలో  మొత్తం అందరికీ  మాస్, క్లాస్, యూత్ అందరికీ ఈ సినిమా రీచ్ అవ్వాలని బిగ్  స్క్రీన్ మీద ఈ సినిమా చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరు అని ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం.మా సినిమాను చూసిన ప్రేక్షకులు అందరూ కూడా మౌత్ టాక్ తో పదిమందికి చెప్పి మా సినిమాను గొప్ప విజయం సాధించేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
 
సహ నిర్మాత రామకృష్ణ మాట్లాడుతూ, మేము బడ్జెట్ కంటే ఎక్కువ ఇస్తామని ఓటిటి నుండి ఆఫర్ వచ్చినా మా ఫ్రెండ్స్ శ్రేయోభిలాషులు సలహా మేరకు మేము ధైర్యం చేసి మా సినిమాను థియేటర్లలో విడుదల చేయాలను కున్నాం. మారుతి గారు నాకు మంచి ఫ్రెండ్ మా జర్నీ 23 సంవత్సరాలుగా కొనసాగుతోంది.దర్శకుడు వెంకటేష్. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నా ఈ సినిమా ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.