ప్రేమించడానికి కారణం ఉండకూడదు అంటున్న నిఖిల్ సిద్ధార్థ్
Nikhil Siddharth, Anupama Parameshwaran
ఇప్పటికే విడుదలైన 18 పేజెస్ పబ్లిసిటీ కంటెంట్ కు అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ కంపోజ్ చేసిన 18 పేజీస్ ఫస్ట్ సింగిల్ సాంగ్ కి సంబంధించిన గ్లింప్స్ వీడియో విడుదలై ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. నాకు తెలియని ఒక అమ్మాయి ఎప్పుడూ ఒక విషయం చెబుతూండేది..! ప్రేమించడానికి కారణముండకూడదు..ఎందుకు ప్రేమించామా..? అంటే ఆన్సర్ ఉండకూడదు..అని నిఖిల్ సంభాషణలతో మొదలైంది వీడియో. ఆ తర్వాత నన్నయ్య రాసిన కావ్యమాగితే..తిక్కన తీర్చేనుగా..రాధమ్మ ఆపిన పాట మధురిమ..కృష్ణుడు పాడెనుగా..అని బ్యాక్ గ్రౌండ్ సాంగ్తో సాగుతున్న ఈ గ్లింప్స్ వీడియో సినిమాపై క్యూరియాసిటీని పెంచడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. అతి తర్వలో ఈ పాటకి సంబంధించిన ఫుల్ సాంగ్ ని విడుదలచేయడంతో పాటు మరిన్ని వివరాలు అధికారికంగా ప్రకటిస్తామని నిర్మాత బన్నీవాసు తెలిపారు.

