గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 5 ఫిబ్రవరి 2022 (17:48 IST)

విడాకులు గురించి చెప్పడంతో క‌నెక్ట్ అయ్యా- సుమంత్

‘మళ్ళీ రావా" వంటి బ్లాక్ బస్టర్ తరువాత సుమంత్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘మళ్ళీ మొదలైంది’.టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు. ఈడీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సినిమాను ‘జీ 5’ ఓటీటీ ఎక్స్‌క్లూజివ్‌గా విడుదల చేయనుంది. ఓటీటీ రైట్స్‌ను దక్కించుకుంది. ఈ నెల 11న సినిమాను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రే రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.
 
హీరో సుమంత్ మాట్లాడుతూ.. కథ చెప్పేటప్పుడు విడాకులు గురించి చెప్పడంతో ఈ కథ నాకు నచ్చడంతో ఈ సబ్జెక్ట్ చేద్దాం అనుకున్నాము.అనూప్  మంచి పాటలు ఇచ్చాడు. ప్రేమకథ దగ్గర్నుంచి నా ప్రతి సినిమాకు ఒక సిగ్నేచర్ సాంగ్ ఉంటుంది ఈ సినిమాలో కూడా  ఆలోన్. ఆలోన్ అనే పాట కూడా సిగ్నేచర్ సాంగ్ అవుతుంది.  ఫిబ్రవరి11న జి5 లో మీ ముందుకు రాబోతుంది ఈ సినిమా ను సబ్స్ క్రైబ్ చేసుకొని చూడండి అన్నారు.
 
అన్న పూర్ణమ్మ మాట్లాడుతూ.. ఈ జనరేషన్ పిల్లలకు తలకాయ పగలగొట్టుకుని మెంటల్ వచ్చి పిచ్చాసుపత్రి లో  చేరకుండా ఉండేలా లైట్ గా సరదాగా నవ్వుకుంటూ జీవితంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చు అనే ఒక అందమైన కథ .ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది  సినిమా చూసిన తర్వాత వారి సమస్యలను ఇంట్లోనే పరిష్కరించుకోవచ్చు.సినిమా బాగా ఉంది. కడుపారా నవ్వుకోనే కామెడీ ఉంటుంది అన్నారు.
 
చిత్ర నిర్మాత  రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ సినిమాను ఎవరితో చేద్దాం అనుకున్నప్పుడు మాకు సుమంత్ గుర్తుకు రావడంతో తనతో ఈ సినిమా చేయడం జరిగింది. ఈ సినిమాలో తను చాలా బాగా యాక్ట్ చేశాడు. చరణ్ గారు నా మా బిజినెస్ లో రైట్ హ్యాండ్ గా వుంటూ ఈ ఫిల్మ్ బిజినెస్ చూసుకున్నాడు.అనూప్ ఇచ్చిన  మూడు పాటలు  చాలా బాగున్నాయి అన్నారు.
 
చిత్ర దర్శకుడు కీర్తి కుమార్ మాట్లాడుతూ.. ఫస్ట్ లాక్ డౌన్ లో ఈ స్క్రిప్టు సుమంత్ గారికి చెప్పడం జరిగింది. స్క్రిప్ట్ నచ్చి ఈ సినిమా చేయడానికి వచ్చాడు. తర్వాత .సీఈఓ చరణ్ తేజ్ కు కూడా స్టోరీ చెప్పడం జరిగింది.నిర్మాత రాజన్న సినిమా నిర్మాణంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఫుల్ సపోర్ట్ చేశారు.తను ట్రైలర్ తర్వాత నీ వర్క్ బాగుంది, విజువల్స్ బాగున్నాయి అని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అలాగే మాకు ఏం కావాలంటే అది అందించడం  జరిగింది. ఈ సినిమాను సుమంత్, అన్నపూర్ణమ్మ , పోసాని గారు సుహాసిని,వెన్నెల కిషోర్ గార్లతో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.
 
నిర్మాత బన్నీవాసు, హీరో నిఖిల్ సిద్ధార్థ్, విశ్వక్ సేన్, అడవి శేషు,  అనూప్ రూబెన్స్  సుశాంత్ త‌దిత‌రులు మాట్లాడారు.