1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Posani Krishna Murali tested Covid Positive Again

నటుడు పోసాని కృష్ణమురళికి మళ్లీ కరోనా పాజిటివ్

posani krishnamurali
తెలుగు సినీ నటుడు పోసాని కృష్ణమురళికి మరోమారు కరోనా వైరస్ సోకింది. ఆయన కరోనా వైరస్ బారినపడటం ఇది మూడోసారి. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా కేబినెట్ హోదాలో ఉన్నారు. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. 
 
ఇదిలావుంటే, ఇటీవల పూణెలో జరిగిన షూటింగులో పాల్గొన్న పోసాని.. గురువారం హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఆయనకు జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపించడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో ఈ వైరస్ సోకినట్టు తేలింది. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స అందిస్తున్నారు. 
 
మరోవైపు, దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. గురువారం ఒక్కరోజే పది వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. బహిరంగ ప్రాంతాలు, రద్దీ ప్రదేశాలకు వెళ్లే ప్రజలు విధిగా ముఖానికి మాస్కులు ధరించాలని పలు రాష్ట్రాల్లో సూచిస్తూ కరోనా నిబంధనలను కూడా సడలిస్తున్నాయి. 
 
తర్వాతి కథనం
గ్రాఫిక్స్ మాయాజాలంతో శాకుంతలం ఎలా తీశారంటే.. రివ్యూ