సంబంధిత వార్తలు
- వెండితెరపై సూపర్ కాంబో.. ప్రభాస్- అరవింద్ స్వామి కలిసి..?
- మహేష్ బాబుకి తల్లిగా రేణూ దేశాయ్...
- కైరా అద్వానీతో ప్రభాస్ రొమాన్స్.. కెమిస్ట్రీ పండితే ఇంకేముంది? (video)
- ప్రభాస్ హీరోయిన్‌తో మహేష్ రొమాన్స్, ఇంతకీ ఎవరా హీరోయిన్..? (Video)
- డార్లింగ్ ప్రభాస్‌తో నీహారిక ప్రేమాయణం ... క్లారిటీ ఇచ్చిన మెగా డాటర్ (Video)
ప్రభాస్‌ని ఢీ కొట్టబోతున్న స్టైలీష్ విలన్ ఇతనే..!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్‌తో ప్రభాస్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్ పైన సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. వచ్చే సంవత్సరం ప్రథమార్ధంలో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. అయితే.. ఈ సినిమాలో విలన్ పాత్రను ఎవరితో చేయించాలా అని ఆలోచిస్తే.. స్టైలీష్ విలన్ అరవింద్ స్వామి అయితే కరెక్ట్ సరిపోతారని టీమ్ అనుకోవడంతో అరవింద్ స్వామిని కాంటాక్ట్ చేసారని తెలిసింది. ఫోన్లో మూవీ స్టోరీ, అతని క్యారెక్టర్ చెబితే.. చాలా బాగుంది అంటూ వెంటనే ఓకే చెప్పాడని తెలిసింది.
పాన్ ఇండియా మూవీగా కాకుండా పాన్ వరల్డ్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమా ఓ కొత్త అనుభూతి కలిగించేలా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ నటించనున్నట్టు సమాచారం. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఏ రేంజ్‌లో ఉందో తెలిసిందే. మరి.. ఈ సినిమాతో ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.
