బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 ఏప్రియల్ 2020 (18:05 IST)

కైరా అద్వానీతో ప్రభాస్ రొమాన్స్.. కెమిస్ట్రీ పండితే ఇంకేముంది? (video)

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ సాహో సినిమాలో నటించాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో గుర్తింపు సంపాదించిపెట్టలేకపోయింది. సాహో తర్వాత ప్రభాస్ జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ డియర్ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. ఇక మహానటి వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన నాగ్ అశ్విన్ దర్శకత్వంలోను ప్రభాస్ ఓ సినిమా చేయనుండగా, ఈ చిత్రంలో కథానాయిక ఎవరనే దానిపై కొద్దిరోజులుగా చర్చ సాగుతోంది. 
 
నాగ్ అశ్విన్‌- ప్రభాస్ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబడుతుండగా, ఈ సినిమా అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుంది. కీలక పాత్రల కోసం పలువురు బాలీవుడ్ స్టార్స్‌ని ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక హీరోయిన్ కోసం బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె ఈ సినిమాలో నటించడం దాదాపు ఖరారైందని.. లాక్ డౌన్ తరువాత ఫైనల్‌ ప్రకటన వుంటుందని సమాచారం. 
 
సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమా కోసం 50 కోట్లకి పైగా బడ్జెట్ కేటాయించనున్నట్టు తెలుస్తుంది. కైరా, ప్రభాస్ కెమిస్ట్రీ బాగా సూటవుతుందని.. సాహో తర్వాత సూపర్ హిట్ మూవీగా ఇది ప్రభాస్ కెరీర్‌లో నిలిచిపోతుందని సినీ జనం అంటున్నారు.