శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 16 ఏప్రియల్ 2020 (22:28 IST)

ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్‌‌లా నిఖిల్ కూడా అదే చేస్తున్నాడా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం బాహుబలి. ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. రూ. 1000 కోట్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ ఇండియన్ మూవీగా బాహుబలి చరిత్ర సృష్టించింది. దీంతో బాలీవుడ్, హాలీవుడ్ మూవీ తీయాలంటే, ఎక్కడికో వెళ్లి తీయాల్సిన అవసరం లేదు. ఇక్కడే హైదరాబాద్‌లో ఉండే.. అలాంటి సినిమా తీయచ్చు అని రాజమౌళి తీసి చూపించారు. 
 
బాహుబలి సినిమా వచ్చిన తర్వాత నుంచి టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్‌వుడ్‌లలోని దర్శకనిర్మాతలకు, హీరోలకు పాన్ ఇండియా మూవీ చేయాలనే ఇంట్రస్ట్ మరింత పెరిగింది.
 
దీంతో ఇప్పుడు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ సినీ ఇండస్ట్రీలలో పాన్ ఇండియా మూవీస్ రూపొందుతున్నాయి. 
 
టాలీవుడ్ విషయానికి వస్తే... బాహుబలి తర్వాత ప్రభాస్ సాహో అంటూ మరో పాన్ ఇండియా మూవీ చేసాడు. రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో రూపొందిన సాహో టాలీవుడ్ ప్రేక్షకులు కన్నా బాలీవుడ్ ప్రేక్షకుల్నే ఎక్కువుగా ఆకట్టుకోవడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి సైతం పాన్ ఇండియా మూవీ చేసారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ కలిసి ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. 
 
ఇలా.. టాలీవుడ్ హీరోలు బాహుబలి సినిమా ఇచ్చిన స్పూర్తితో పాన్ ఇండియా మూవీస్ చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.
 
తాజా వార్త ఏంటంటే.. యువ హీరో నిఖిల్ కూడా పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడని తెలిసింది. అర్జున్ సురవరం సినిమాతో హిట్ అందుకున్న నిఖిల్, ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. ఒకటి 18 పేజిస్ కాగా, మరొకటి కార్తికేయ 2. ఈ రెండు సినిమాల పైనే ఆయన పూర్తి దృష్టిపెట్టాడు. 
 
కార్తికేయ సినిమా విభిన్న కథా చిత్రంగా అందర్నీ ఆకట్టుకుంది. దీంతో కార్తికేయ 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాని చందు మొండేటి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నాడని సమాచారం. దీంతో  మరిన్ని అంచనాలు పెరిగాయి. మరి.. ప్రభాస్, చిరంజీవి, ఎన్టీఆర్, చరణ్‌ బాటలో నడుస్తూ పాన్ ఇండియా మూవీ చేస్తున్న నిఖిల్ కార్తికేయ 2 సినిమాతో ఏ స్ధాయి విజయాన్ని సాధిస్తాడో చూడాలి.