క్వారంటైన్ గది కిటికీకి టవల్‌తో ఉరేసుకున్న కరోనా బాధితులు
దేశరాజధాని ఢిల్లీలో విషాద ఘటన జరిగింది. కరోనా క్వారంటైన్ కేంద్రంలో ఉంటున్న ఉంటున్న ఓ వ్యక్తి తన టవల్‌తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బీహార్ రాష్ట్రంలోని దర్భంగా జిల్లాకు చెందిన 43 యేళ్ళ వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో ఈ నెల 10న ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తిని కుమ్రౌలీలోని ఒక పాఠశాలలో ఏర్పాటుచేసిన క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు.
కాగా, సోమవారం రాత్రి రూమ్‌లోని కిటికీకి టవల్‌తో ఉరివేసుకుని చనిపోయాడని పోలీసులు చెప్పారు. ఆ వ్యక్తి చాలా రోజులుగా టీబీతో బాధపడుతున్నాడు. దాని వల్ల ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోందని వైద్యులు తెలిపారు. టీబీతో పాటు కుటుంబ సమస్యల వల్లే అతను చనిపోయాడని జిల్లా కలెక్టర్ త్యాగరాజన్ చెప్పారు.
క్వారంటైన్ కేంద్రానికి వచ్చినప్పుడే తనకు టీబీ ఉందని చాలా ఒత్తిడికి గురయ్యాడని తెలిపారు. వైద్యులు అతనికి అవసరమైన ఆహారం, మందులు ఇచ్చారని చెప్పారు. కాగా, ఈ నెల 11న ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలో హోం క్వారంటైన్‌లో ఉన్న 21 ఏళ్ల ఓ వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకున్న విషయంతెల్సిందే.