సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 31 డిశెంబరు 2017 (16:41 IST)

కన్నడ హీరో ఎంత పనిచేశాడు.. కూల్‌డ్రింక్స్‌లో మత్తు మందు కలిపి.. రేప్..

కన్నడ హీరోపై అత్యాచారం కేసు నమోదైంది. "హోంబణ్ణ'' సినిమా హీరో సుబ్రహ్మణ్య తనపై అత్యాచారానికి పాల్పడ్డంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. సుబ్రహ్మణ్య పారిపోయాడు. వివరాల్లోకి వెళితే.. రాజాజీనగర్‌కు

కన్నడ హీరోపై అత్యాచారం కేసు నమోదైంది. "హోంబణ్ణ'' సినిమా హీరో సుబ్రహ్మణ్య తనపై అత్యాచారానికి పాల్పడ్డంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. సుబ్రహ్మణ్య పారిపోయాడు. వివరాల్లోకి వెళితే.. రాజాజీనగర్‌కు చెందిన యువతి, సుబ్రహ్మణ్య ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు పెద్దలు కూడా పచ్చాజెండా ఊపారు. 
 
అయితే సుబ్రహ్మణ్య మాత్రం సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఇంతలో తన సోదరి ఇంట్లో పార్టీ వుందని యువతిని పిలిపించుకున్నాడు. ఆ యువతి కూడా సుబ్రహ్మణ్య ఇంటికి వెళ్లింది. కానీ సుబ్రహ్మణ్య ఆమెకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు. ఆపై అత్యాచారం చేశాడు.
 
తనకేదో అయ్యిందని తెలుసుకున్న యువతి.. సుబ్రహ్మణ్యను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఒత్తిడి చేసింది. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుబ్రహ్మణ్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు.