శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 26 డిశెంబరు 2017 (16:24 IST)

మైనర్ బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం.. వీడియో తీసి బెదిరింపులు

మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లా మైతాపూరులో చోటుచేసుకుంది. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా ఆ తతంగాన్నంతా సెల్ ఫోన్‌లో చిత్రీకరించిన మృగాళ్లను పోలీస

మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లా మైతాపూరులో చోటుచేసుకుంది. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా ఆ తతంగాన్నంతా సెల్ ఫోన్‌లో చిత్రీకరించిన మృగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా మైతాపూర్‌లో మైనర్‌ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడి.. లైంగిక దాడి దృశ్యాలను సెల్‌ఫోన్‌ చిత్రీకరించారు. 
 
లైంగిక దాడి జరిగిన విషయాన్ని బయటికి చెప్తే.. వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బెదిరించారు. దీంతో జడుసుకున్న ఆ బాలిక మూడు రోజుల పాటు ఆ ఘోరాన్ని బయటికి చెప్పలేదు. చివరికి తల్లిదండ్రుల వద్ద వెల్లడించడంతో.. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. బాధితురాలు ఎనిమిదో తరగతి చదువుతోందని.. బాధితురాలు స్కూలు నుంచి ఇంటికి వెళ్తుండగా ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.