శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 26 డిశెంబరు 2017 (09:47 IST)

అన్నయ్య స్నేహితుడని నమ్మితే... అతని ఫ్రెండ్‌తో కలిసి రేప్ చేశాడు...

ఓ బాలిక సామూహిక అత్యాచారానికిగురైంది. అన్నయ్య స్నేహితుడే అని నమ్మి వెంట నడిస్తే అతని స్నేహితుడితో కలిసి రేప్ చేశాడు. తెలంగాణ రాష్ట్రంలోని రాయికల్ మండలం మైతాపూర్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. ఈ వివరాలను

ఓ బాలిక సామూహిక అత్యాచారానికిగురైంది. అన్నయ్య స్నేహితుడే అని నమ్మి వెంట నడిస్తే అతని స్నేహితుడితో కలిసి రేప్ చేశాడు. తెలంగాణ రాష్ట్రంలోని రాయికల్ మండలం మైతాపూర్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
మైతాపూర్‌ గ్రామానికి చెందిన 14 యేళ్ళ బాలిక రాయికల్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ప్రతిరోజు గ్రామం నుంచి రాయికల్‌కు వచ్చి సాయంత్రం తిరిగి వెళ్తుంది. ఆదివారం పాఠశాలకు ప్రత్యేక తరగతుల కోసం వచ్చిన బాలిక సాయంత్రం ఇంటికి వెళ్లడానికి ఆటోలు లేకపోవడంతో తన అన్నయ్య స్నేహితునికి ఫోన్‌ చేసి తనను ఇంటి వద్ద దింపమని కోరింది.
 
సదరు యువకుడు బాలికను బైక్‌పై ఎక్కించుకుని మైతాపూర్‌ శివారులోకి తీసుకువెళ్లాడు. అప్పటికే అక్కడ విజయ్‌ వేసివున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఆ బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. పనిలోపనిగా బాలికను నగ్నంగా చేసి ఫోటోలు, వీడియోను చిత్రీకరించి, ఎవరికైనా చెబితే సామాజిక మాధ్యమాలలో పెడతామని బెదిరించి ఇంటి వద్ద వదిలేశారు. బాలిక ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలుపడంతో, గ్రామస్థుల సహాయంతో నిందితులను వెతికి పోలీసులకు అప్పగించారు.