1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Lover Attack On His Girlfriend Due To reject Physical relationship

పిల్లలు మేల్కొన్నారనీ 'అందుకు' అంగీకరించని ప్రియురాలు... ప్రియుడు ఏం చేశాడంటే...

కడప జిల్లా ఎర్రగుంట్లలో ఓ దారుణం జరిగింది. శారీరకంగా కలిసేందుకు నిరాకరించిన ప్రియురాలిపై ప్రియుడు దాడి చేశాడు. అంతేనా, తల్లిపై జరుగుతున్న దాడిని అడ్డుకోబోయిన పిల్లలను కూడా చితకబాదాడు.

Lover
కడప జిల్లా ఎర్రగుంట్లలో ఓ దారుణం జరిగింది. శారీరకంగా కలిసేందుకు నిరాకరించిన ప్రియురాలిపై ప్రియుడు దాడి చేశాడు. అంతేనా, తల్లిపై జరుగుతున్న దాడిని అడ్డుకోబోయిన పిల్లలను కూడా చితకబాదాడు. దీంతో వారంతా తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఎర్రగుంట్ల సమీపంలోని వేంపల్లిరోడ్డులోని ఎస్సీకాలనీలో చిలమకూరు మరళికి జ్వాలమ్మ అనే మహిళతో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే, జ్వాలమ్మకు అదే ప్రాంతానికి రాజేష్‌తో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలుసుకున్న భర్త మురళి గతంలో రాజేష్‌పై కత్తితోదాడిచేశాడు. దీంతో మురళిపై 307 కేసునమోదైంది. దాడి జరిగినా రాజేష్‌ - జ్వాలమ్మల మధ్య కొనసాగుతున్న వివాహేతర సంబంధం విడిపోలేదు.
 
ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి జ్వాలమ్మ ఇంటికి రాజేష్‌ వెళ్లాడు. ఆ సమయంలో పిల్లలు మేల్కొని ఉన్నారు. దీంతో అతనితో కలిసి శారీరక సుఖం పంచుకునేందుకు జ్వాలమ్మ నిరాకరించింది. దీంతో ప్రియురాలితో వాగ్వాదానికి దిగి ఘర్షణ పడి, ఆమెపై కత్తితో దాడి చేశాడు.

ఈ దాడిని జ్వాలమ్మ పిల్లలు అడ్డుకున్నారు. దీంతో వారిపై కూడా రాజేష్ దాడిచేసి తీవ్రంగా గాయపరచాడు. తీవ్రంగా గాయపడిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పరారీలో ఉన్న ప్రియుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
మీ చెస్ట్ కొలతలు ఏంటి.. మహిళలను అడుగుతున్న మధ్యప్రదేశ్ సర్కారు