ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శుక్రవారం, 22 డిశెంబరు 2017 (09:15 IST)

పాముకుంటలో విషాదం.. ఒకే కుటుంబంలో ఏడుగురి మృతి

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం పాముకుంటలో పెను విషాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు అనుమానాస్పదంగా చనిపోయారు.

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం పాముకుంటలో పెను విషాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు అనుమానాస్పదంగా చనిపోయారు. వీరంతా కోళ్లఫారం వద్ద నివాసగృహంలో వీరు విగత జీవులుగా పడిఉన్నారు. మృతులను బచ్చలి బాలనర్సయ్య (65), భారతమ్మ (58), దంపతులు బాలరాజు (44), నిర్మల (39) సహా ఇద్దరు కుమారులు చింటూ (12), బన్ని (8), కుమార్తె శ్రావణి (14)లుగా గుర్తించారు. 
 
జనగాం జిల్లా స్టేషన్ ఘన్‌‍పూర్ మండలం తరిగొప్పుల గ్రామానికి చెందిన వీరంతా నెల రోజుల క్రితం కోళ్లఫారంలోనే పనికి కుదిరారు. రాత్రి భుజించిన చికెన్ విషతుల్యం కావడం వల్లే మరణించివుంటారని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు.