శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : గురువారం, 14 డిశెంబరు 2017 (15:33 IST)

'అర్జున్ రెడ్డి'తో శేఖర్ కమ్ముల సినిమా

''అర్జున్ రెడ్డి'' నటనకు దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా ఫిదా అయ్యారు. అర్జున్ రెడ్డి పాత్రలో కనిపించిన విజయ్ దేవర కొండతో సినిమా చేసేందుకు శేఖర్ కమ్ముల రెడీ అవుతున్నారు. ఇప్పటికే అర్జున్ రెడ్డికి శేఖర్ కమ్

''అర్జున్ రెడ్డి'' నటనకు దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా ఫిదా అయ్యారు. అర్జున్ రెడ్డి పాత్రలో కనిపించిన విజయ్ దేవర కొండతో సినిమా చేసేందుకు శేఖర్ కమ్ముల రెడీ అవుతున్నారు. ఇప్పటికే అర్జున్ రెడ్డికి శేఖర్ కమ్ముల స్క్రిప్ట్ వినిపించారు. ప్రస్తుతం చేతినిండా ఆఫర్లతో బిజీ బిజీగా ఉన్న విజయ్‌తో అన్నీ కుదిరితే ఆ సినిమాను విజయ్‌ దేవరకొండ హోమ్‌ ప్రొడక్షన్స్‌లో స్వయంగా నిర్మించొచ్చని సమాచారం. 
 
శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌’ చిత్రంలో హీరో గ్యాంగ్‌లో చిన్న పాత్రలో అప్పట్లో కనిపించిన విజయ్‌తో ప్రస్తుతం శేఖర్ సినిమా చేయనుండటం విశేషం. ఇప్పటికే క్రాంతిమాధవ్, నందినీ రెడ్డి, రాహుల్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమాలు చేయనున్నారు. మరి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవరకు శేఖర్ కమ్ముల విజయ్‌తో సినిమా చేసేందుకు వేచి వుంటారా? లేకుంటే వేరే హీరోగా సినిమా లాగించేస్తాడా? అనేది వేచి చూడాలి.