ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : మంగళవారం, 5 డిశెంబరు 2017 (12:43 IST)

అర్జున్ రెడ్డికే లిప్ కిస్ ఇచ్చాను.. విజయ్ దేవరకొండకు కాదు: షాలినీ పాండే

అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే లిప్ లాక్‌పై స్పందించింది. తాజాగా 100% లవ్ తమిళ రీమేక్‌లో నటిస్తున్న షాలినీ పాండే.. అర్జున్ రెడ్డిలో తానిచ్చిన లిప్ కిస్‌లపై నోరు విప్పింది. తనకు ప్రేమ అనుభవం ఇంతవ

అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే లిప్ లాక్‌పై స్పందించింది. తాజాగా 100% లవ్ తమిళ రీమేక్‌లో నటిస్తున్న షాలినీ పాండే.. అర్జున్ రెడ్డిలో తానిచ్చిన లిప్ కిస్‌లపై నోరు విప్పింది. తనకు ప్రేమ అనుభవం ఇంతవరకు కలగలేదని.. ఆ చిత్రంలో ప్రీతి రోల్ పోషించానని.. ఆ క్యారెక్టర్‌లో భాగంగానే అర్జున్ రెడ్డికి లిప్ కిస్‌లు ఇచ్చానే తప్ప.. అక్కడ తనకు విజయ్ దేవరకొండ కనిపించలేదని తెలిపింది. 
 
మిగిలిన అమ్మాయిలతో పోలిస్తే.. తాను కొంచెం తేడా అని.. తాను మరబొమ్మగా అబ్బాయిలను భావిస్తానని చెప్పింది. అర్జున్ రెడ్డిలో ఎంతో ప్యాషన్‌తో కిస్ సీన్స్ చేశానని తెలిపింది. స్టోరీ పరంగా బికినీలు ధరించేందుకు తనకు అభ్యంతరం లేదని షాలినీ పాండే తెలిపింది. ముద్దు పెట్టుకోవడం కూడా ఓ ఎమోషన్ అని.. అందుకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని షాలినీ పాండే చెప్పింది.