శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : గురువారం, 2 నవంబరు 2017 (11:08 IST)

కొత్తగా ఇద్దరు హీరోయిన్లతో శర్వానంద్ రొమాన్స్: నివేదా, షాలినీ పాండే రెడీ..

''శర్వానంద్'' సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. సుధీర్ వర్మతో చేసే తాజా సినిమాలో శర్వానంద్ మాఫియా డాన్‌గా కనిపించనున్నాడు. ఇందులో అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే, మరో హీరోయిన్‌గా నివేదా థామస్

''శర్వానంద్'' సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. సుధీర్ వర్మతో చేసే తాజా సినిమాలో శర్వానంద్ మాఫియా డాన్‌గా కనిపించనున్నాడు. ఇందులో అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే, మరో హీరోయిన్‌గా నివేదా థామస్ నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఓ సామాన్య యువకుడు మాఫియా డాన్‌గా ఎలా మారాడనే కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. 
 
ఇందులో యంగ్ లుక్‌తో పాటు మాఫియా డాన్‌గా శర్వానంద్ కనిపిస్తాడు. తద్వారా శర్వానంద్ మొదటిసారిగా ద్విపాత్రాభినయం చేయనున్నాడు. శర్వానంద్ ఇంతవరకూ ఇద్దరు హీరోయిన్స్‌తో రొమాన్స్ చేసిన దాఖలాలు కనిపించవు. కానీ ఈ సినిమా కోసం షాలినీ పాండే.. నివేదా థామస్‌తో రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.  
 
ఇక ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో షాలినీ పాండే ఎంత పాప్యులర్ అయిందో తెలిసిందే. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘మహానటి’ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. అంతేకాకుండా ‘100% లవ్’ తమిళ రీమేక్ లోను చేస్తోంది.