శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 17 అక్టోబరు 2017 (13:02 IST)

''మహానుభావుడు''తో షాలినీ పాండే.. శర్వానంద్ ద్విపాత్రాభినయం..

''మహానుభావుడు''తో హిట్ కొట్టిన సుధీర్ వర్మ.. అదే హీరో శర్వానంద్‌తో కొత్త సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో శర్వానంద్ తొలిసార

''మహానుభావుడు''తో హిట్ కొట్టిన సుధీర్ వర్మ.. అదే హీరో శర్వానంద్‌తో కొత్త సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో శర్వానంద్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ఈ చిత్రంలో ఇప్పటికే ఒక హీరోయిన్‌గా నివేదా థామస్ ఎంపికైందని వార్తలు వినిపిస్తున్నాయి. రెండో హీరోయిన్‌గా షాలినీ పాండేను తీసుకున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. 'అర్జున్ రెడ్డి' సినిమాతో షాలినీ పాండే మంచి క్రేజ్ కొట్టేసింది. 
 
ప్రస్తుతం తెలుగులో మహానటి చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. అంతేగాకుండా తమిళంలో రీమేక్ అవుతున్న ''100% లవ్" తమిళ రీమేక్‌లోనూ నటిస్తోంది. తాజాగా శర్వానంద్ సినిమాలోనూ అవకాశం కొట్టేసింది. కాగా సుధీర్ వర్మ, శర్వానంద్, నివేదా థామస్, షాలినీ పాండే కాంబోలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి రానుంది.