1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Fidaa heroine Sai Pallavi dating with Dulquar Salman

యువ హీరోతో 'ఫిదా' హీరోయిన్ సాయిపల్లవి డేటింగ్...

సినిమాల్లోకి వచ్చిన తర్వాత కొంతమంది హీరోయిన్లు తమ సహచర హీరోలతో ప్రేమలో పడిపోతుంటారు. కొంతమందైతే ఇష్టమైతే డేటింగ్ చేస్తూ ఆ తర్వాత విడిపోతుంటారు. ఇదంతా సినీపరిశ్రమలో మామూలే.

Sai Pallavi
సినిమాల్లోకి వచ్చిన తర్వాత కొంతమంది హీరోయిన్లు తమ సహచర హీరోలతో ప్రేమలో పడిపోతుంటారు. కొంతమందైతే ఇష్టమైతే డేటింగ్ చేస్తూ ఆ తర్వాత విడిపోతుంటారు. ఇదంతా సినీపరిశ్రమలో మామూలే. అలాంటిదే ఇప్పుడు 'ఫిదా' ఫేమ్ సాయిపల్లవి చేస్తోంది. 'ఫిదా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సాయిపల్లవి ఇప్పుడు ఒకరి ప్రేమలో పడి అతనితో డేటింగ్ చేస్తోందని తెలుగు సినీపరిశ్రమలో హాట్ టాపిక్ నడుస్తోంది.
 
ఆ హీరో మరెవరో కాదు "ఓకే బంగారం"తో తెలుగు సినీపరిశ్రమకు పరిచయమైన దుల్కర్ సల్మాన్. ఈ యువహీరోతో కలిసి 'ఓయ్ పిల్లగాడా' అనే సినిమాలో ఈ భామ నటిస్తోంది. సినిమా ఘూటింగ్‌లో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఆ ప్రేమ కాస్త ఇప్పుడు డేటింగ్ వరకు వెళ్ళిందట. మరి వీరి ప్రేమ గాథ కూడా సినిమా షూటింగ్ పూర్తయ్యేంత వరకు ఉంటుందా? లేకుంటే శాశ్వతంగా ఉంటుందా? అన్నదే కాలమే సమాధానం చెప్పాలి. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ఓవర్సీస్‌లో ప్రిన్స్ వర్సెస్ యంగ్ టైగర్ ... "స్పైడర్ - జై లవ కుశ" కాసుల వర్షం