శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (13:15 IST)

మారి-2లో ఫిదా హీరోయిన్.. ధనుష్ సరసన సాయిపల్లవి

ప్రేమమ్ సినిమాలో మలర్ పాత్రలో, ఫిదా చిత్రంలో భానుమతిగా అలరించిన సాయిపల్లవి ప్రస్తుతం బంపర్ ఛాన్స్ కొట్టేసింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ హీరోగా నటించిన ''మారి'' సినిమా సీక్వెల్‌లో నటిం

ప్రేమమ్ సినిమాలో మలర్ పాత్రలో, ఫిదా చిత్రంలో భానుమతిగా అలరించిన సాయిపల్లవి ప్రస్తుతం బంపర్ ఛాన్స్ కొట్టేసింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ హీరోగా నటించిన ''మారి'' సినిమా సీక్వెల్‌లో నటించే అవకాశాన్ని కైవసం చేసుకుంది. 
 
హీరోయిన్ పాత్ర ఈ సినిమాలో వైవిధ్యంగా వుంటుందని.. అందుకే సాయిపల్లవి ఈ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్ వస్తోంది. ముందు నుంచి నటనకు ప్రాధాన్యత గల పాత్రల్లో కనిపిస్తానని చెప్పుకొస్తున్న సాయి పల్లవి.. సినీ ఛాన్సుల ఎంపిక ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే మారి-2 సినిమాకు పచ్చజెండా ఊపిందని టాక్. 
 
అంతేగాకుండా.. త‌మిళ హీరో ధ‌నుష్ నటించిన మారి (తెలుగులో మాస్‌) సినిమాకు సీక్వెల్‌గా తెర‌కెక్కనున్న ''మారి-2" చిత్రం కోసం సాయి ప‌ల్ల‌విని హీరోయిన్‌గా ఎంచుకున్న‌ట్లు నిర్మాణ సంస్థ వూండ‌ర్‌బార్ ఫిల్మ్స్ ధ్రువీకరించింది. 
 
ఇప్పటికే పీఎల్ విజ‌య‌న్ 'కణం' సినిమా ద్వారా తమిళతెరకు పరిచయం అవుతున్న సాయిపల్లవి.. ధనుష్ సినిమాలో నటించడం ద్వారా తమిళ ప్రేక్షకుల మదిని దోచుకోవడం ఖాయమని సినీ పండితులు అప్పుడే జోస్యం చెప్తున్నారు. మారి-2 సినిమా తమిళ, తెలుగు భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి బాలాజీ మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.