శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : మంగళవారం, 3 అక్టోబరు 2017 (14:59 IST)

నానితో గొడవకు దిగిన సాయిపల్లవి.. ఎందుకు?

సక్సెస్ ఫుల్ హీరో, నేచురల్ స్టార్ నాని తాజాగా సాయిపల్లవితో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలో నాని సాయిపల్లవికి మధ్య గొడవ జరిగిందట. ఈ గొడవ ఎప్పుడో జరిగినా ప్రస్తుతం అది

సక్సెస్ ఫుల్ హీరో, నేచురల్ స్టార్ నాని తాజాగా సాయిపల్లవితో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా షూటింగ్ సమయంలో నాని సాయిపల్లవికి మధ్య గొడవ జరిగిందట. ఈ గొడవ ఎప్పుడో జరిగినా ప్రస్తుతం అది వెలుగులోకి వచ్చింది.

వీరిద్దరి మధ్య సయోధ్య కుదుర్చాలని నిర్మాత ప్రయత్నించినా... కుదరలేదట. ప్రస్తుతం వీరిద్దరూ కలసి ఏదో ఇక విధంగా షూటింగ్ పూర్తి చేసేసి... మాట్లాడుకోకుండానే వెళ్లిపోతున్నారట. మరోవైపు, సాయిపల్లవి కొంచెం కంట్రోల్ ఉంటే మంచిదని... చిన్న విషయాలకు కూడా గొడవపడితే.. నిలదొక్కుకోవడం కష్టమని సినీ పండితులు అంటున్నారు. 
 
మరోవైపు ''ఫిదా'' సినిమాతో క్రేజ్ సంపాదించుకున్న సాయిపల్లవి.. నానికి జోడీగా 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమా చేస్తోంది. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె 'ప్రేమమ్' మలయాళ సినిమాకి సంబంధించిన ఒక విషయాన్ని చెప్పింది. ఆ సినిమాలోని ఓ సన్నివేశంలో .. గుప్పెట్లో సీతాకోక చిలుకను ఉంచి.. కొన్ని క్షణాల తరువాత గుప్పెట తెరచి దానిని గాల్లోకి వదిలి సాయిపల్లవి ఆనందించాలి.

అయితే సీతాకోక చిలుకకు ఏమైనా అయితే ఎలాగని టెన్షన్ పడిపోయిందట. అలాంటివాటిని ఇబ్బంది పెట్టడం తనకు ఏమాత్రం ఇష్టం ఉండదని.. మరోసారి అలాంటి సీన్స్ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది.