శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2017 (06:36 IST)

హీరోయిన్లకు బ్లాంక్‌చెక్‌లు ఇచ్చానా? అంబికా కృష్ణ కామెంట్స్ ఏమిటి?

తాను హీరోయిన్లతో ఎంజాయ్ చేసే అలవాటు లేదనీ, పైగా, ఏ ఒక్క హీరోయిన్లకు బ్లాంక్‌చెక్ ఇవ్వలేదనీ ఏపీ ఫిల్మ్, థియేటర్, డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, టీడీపీ నాయకుడు అంబికా కృష్ణ అన్నారు. ఆయన తాజాగా ఇచ్చిన

తాను హీరోయిన్లతో ఎంజాయ్ చేసే అలవాటు లేదనీ, పైగా, ఏ ఒక్క హీరోయిన్లకు బ్లాంక్‌చెక్ ఇవ్వలేదనీ ఏపీ ఫిల్మ్, థియేటర్, డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, టీడీపీ నాయకుడు అంబికా కృష్ణ అన్నారు. ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను వెల్లడించారు.
 
ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ అంటే తనకు ఎంతో అభిమానమని, తానన్నా ఆయనకు అంతే అభిమానమన్నారు. తనకు ఎటువంటి అలవాట్లు లేవని, ఈ రోజుకీ ‘మందు’ అంటే తనకు తెలియదని, ఎన్నో పార్టీలకు వెళ్లినా దాని జోలికి తాను వెళ్లనని, కనీసం వక్కపొడి కూడా వేసుకునే అలవాటు తనకు లేదని చెప్పారు.
 
‘పురుష కార్యకర్తలకు నయా పైసా కూడా ఇవ్వరని, మహిళా కార్యకర్తలకు అయితే డబ్బులిస్తారనే విమర్శ మీపై ఉంది!’ అని ప్రశ్నించగా, అవన్నీ అబద్ధాలని అంబికా కృష్ణ కొట్టిపారేశారు. ‘ఓ హీరోయిన్‌కు అయితే ఏకంగా బ్లాంక్ చెక్ ఇచ్చారట కదా?’ అనే మరో ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, అవన్నీ ఒట్టి మాటలేనని చెప్పుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీలో పాలిటిక్స్ లేవని, ఒకవేళ ఉన్నా, ఇండస్ట్రీని చెడగొట్టేంతగా లేవని అన్నారు. 
 
ఇకపోతే.. బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్‌కు సంబంధాలున్నాయిగానీ, మంచి సంబంధాలున్నాయో, లేదో తనకు తెలియదన్నారు. టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్‌ని మళ్లీ కనెక్ట్ చేయడానికి మీరు పెద్దన్నయ్య పాత్ర నిర్వహిస్తారా? అని ప్రశ్నంచగా, నేనెంత అండీ! పెద్ద పెద్ద వాళ్లు, మేధావులు చాలా మంది ఉన్నారు. ఆ పని మేధావులు చేయాల్సిందే అని అన్నారు.
 
బ్యాంకులను మోసం చేసిన వ్యక్తుల్లో మీ కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఉన్నాయి అని ప్రశ్నించగా, అంబికా దర్బార్ సంస్థ ఏనాడూ దివాళా తీయలేదు. అలాంటిదేమీ లేదు అని చెప్పారు. చదువుకు, వ్యాపారానికి ఎటువంటి సంబంధం లేదని, తన తండ్రి చదువుకున్నది కేవలం మూడో తరగతేనని, ఇరవై ఐదు రూపాయలతో నాడు తమ సంస్థను స్థాపించారని గుర్తు చేశారు.