మంగళవారం, 12 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 11 ఆగస్టు 2025 (15:03 IST)

క్యారెట్లు తింటున్న ఏనుగును వీడియో తీస్తుంటే తొక్కేసింది (video)

Elephant, man
అడవి జంతువులతో ఎంత జాగ్రత్తగా వుండాలో తెలియజెప్పే సంఘటనలు ఎన్నో. ఐనప్పటికీ కొంతమంది వాటిని లైట్ గా తీసుకుంటారు. క్రూరమృగాలను పట్టించుకోకుండా వాటి దరిదాపులోకి వెళ్లిపోయి ప్రాణాలను కోల్పోతుంటారు. అలాంటి ఘటన ఒకటి జరిగింది.
 
రోడ్డుపై ఓ అడవి ఏనుగు క్యారెట్లు తింటోంది. దీనితో వాహనదారులు దాన్ని చూసి ఆగిపోయారు. ఐతే ఓ వ్యక్తి ఆ ఏనుగును వీడియోలో బంధిద్దామని రోడ్డుకి పక్కనే వున్న పల్లంలోకి వెళ్లి వీడియో తీస్తున్నాడు. ఒక్కసారిగా క్యారెట్లు తింటున్న ఆ ఏనుగు ఆ వ్యక్తి వైపుకి దూసుకెళ్లింది. వెంటబడి అతడిని తొక్కేసింది. అతడు గాయాలతో తప్పించుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.