మంగళవారం, 12 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 ఆగస్టు 2025 (15:31 IST)

భారీ వర్షంలో ఫుడ్ డెలివరీకి వెళ్లిన యువకుడు.. డ్రైనేజీలో పడిపోయాడు (Video)

food delivery boy
గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వర్షపు నీరు ఏరులైపారుతోంది. రోడ్లన్నీ జలమయమైపోతున్నాయి. ఈ వర్షాలకు హైదరాబాద్ నగర రహదారులు, వీధులన్నీ నదీ ప్రవాహాలను తలపిస్తున్నాయి. శనివారం కురిసిన భారీ వర్షానికి వీధులు జలమయమయ్యాయి. ఈ క్రమంలో నగరంలోని టీకేఆర్ కమాన్ సమీపంలో ఫుడ్ డెలివ రీ చేసేందుకు వెళుతున్న ఓ యువకుడు బైక్ అదుపుతప్పడంతో పక్కనే ఉన్న డ్రైనేజీలో పడిపోయాడు. 
 
బైక్, ఫుడ్ డెలివరీ బ్యాగు కూడా నాలాలో పడిపోయాయి. వెంటనే స్పందించిన స్థానికులు డెలివరీ బాయ్‌ను, అతడి బైకును వెలికి తీశారు. అయితే, బ్యాగ్, మొబైల్ ఫోన్ మాత్రం వర్షపు నీటిలో కొట్టుకునిపోయాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.