మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 8 అక్టోబరు 2017 (14:12 IST)

''అర్జున్ రెడ్డి'' సెన్సార్ కట్ కాని కాపీ విడుదల.. అక్టోబర్ 13న రిలీజ్

వివాదాస్పద చిత్రం అర్జున్ రెడ్డి సినిమా సెన్సార్ కాని కాపీని తాజాగా విడుదల చేస్తున్నట్లు సమాచారం. సెన్సార్ అవ్వని కాపీతో, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో అక్టోబర్ 13న

వివాదాస్పద చిత్రం అర్జున్ రెడ్డి సినిమా సెన్సార్ కాని కాపీని తాజాగా విడుదల చేస్తున్నట్లు సమాచారం. సెన్సార్ అవ్వని కాపీతో, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో అక్టోబర్ 13న రిలీజ్ చేస్తున్నారు.
 
ఇప్పటికే సెన్సార్ విధించిన కట్స్ తీసేసిన తర్వాత రిలీజైన అర్జున్ రెడ్డి చిత్రం అనేక ఆరోపణలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెన్సార్ కట్ లేని సినిమా రిలీజ్ కానుండటం ఇంకెన్ని వివాదాలకు కారణమవుతుందోనని సినీ పండితులు అంటున్నారు.  
 
అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ, షాలిని పాండే హీరో హీరోయిన్లు. యంగ్ డైరక్టర్ సందీప్ వంగా రూపొందించిన ఈ సినిమా చిన్న సినిమా విడుదలై.. పెద్ద పెద్ద సినిమాలు ఆశ్చర్యపడేలా గేమ్ ఛేంజర్‌లా మారి కలెక్షన్స్‌ని కొల్లగొట్టిన సంగతి తెలిసిందే.