సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (14:10 IST)

ఎన్టీఆర్ బయోపిక్‌కు జేడీ నిర్మాత కాదు: అర్జున్ రెడ్డిలా... రామ్ గోపాల్ రెడ్డి..?

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. అలనాటి నటుడు, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ''లక్ష్మీస్ ఎన్టీఆర్'' అనే టైటిల్ ఖరారు చేశాడు. వైకాపా నేత

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. అలనాటి నటుడు, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ''లక్ష్మీస్ ఎన్టీఆర్'' అనే టైటిల్ ఖరారు చేశాడు. వైకాపా నేత లక్ష్మీ పార్వతితో ఎన్టీఆర్ సంబంధాలపై ఈ స్టోరీ నడుస్తుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి నిర్మాతగా వ్యవహరిస్తున్నారని వార్తలొచ్చాయి. దీనిపై వర్మ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. జె.డి చక్రవర్తి ''లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌" చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు.
 
మరోవైపు అర్జున్ రెడ్డి సినిమా తరహాలో రామ్ గోపాల్ వర్మ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాల్లో హీరోగా నటించి మంచి పేరు సంపాదించిన విజయ్ దేవర కొండ తాజా ట్వీట్‌లో ఆర్‌జీఆర్‌ (రామ్ గోపాల్ రెడ్డి) ను ప‌రిచ‌యం చేస్తున్నానంటూ ఓ ఫొటో పోస్ట్ చేశాడు.

ఆ ఫొటోలో ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో హీరోలా రామ్‌గోపాల్ వ‌ర్మ గ‌డ్డం మీసాల‌తో ఉన్నాడు. దీంతో పాటు ఈయన రామ్ గోపాల్ వర్మ కాదని రామ్ గోపాల్ రెడ్డి అంటూ పోస్ట్ చేశాడు. ''రామ్ గోపాల్ రెడ్డికి హాయ్ చెప్పండి'' అని విజ‌య్ దేవ‌రకొండ పేర్కొన్నాడు. దీనిపై నెటిజన్లు విభిన్నాభిప్రాయాలు పోస్ట్ చేస్తున్నారు.