ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (15:45 IST)

దేవసేనతో మహానుభావుడు చూశాను.. స్పైడర్, జై లవ కుశతో శర్వానంద్ పోటీ

బాహుబలి దేవసేనతో కలిసి ''మహానుభావుడు'' ఫస్ట్‌ షో చూశానంటోంది.. ఆ సినిమా హీరోయిన్. స్పైడర్, జై లవ కుశ వంటి పెద్దహీరోలతో పోటీపడి మరో విజయం సొంతం చేసుకున్న శర్వానంద్ నటించిన మహానుభావుడు సినిమాను అనుష్కతో

బాహుబలి దేవసేనతో కలిసి ''మహానుభావుడు'' ఫస్ట్‌ షో చూశానంటోంది.. ఆ సినిమా హీరోయిన్. స్పైడర్, జై లవ కుశ వంటి పెద్దహీరోలతో పోటీపడి మరో విజయం సొంతం చేసుకున్న శర్వానంద్ నటించిన మహానుభావుడు సినిమాను అనుష్కతో కలిసి చూశానని కథానాయిక మెహరీన్‌ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు అనుష్క మెహరీన్ తీసుకున్న సెల్ఫీని కూడా సోషల్ మీడియాలో పోస్టు చేసింది. 
 
కాగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శర్వానంద్‌, మెహరీన్ సరసన నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పలువురు చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. 
 
భలే భలే మొగాడివో చిత్రంలో మతిమరుపు కథతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచిన మారుతి.. ప్రస్తుతం అతి శుభ్రత (ఓసీడీ) అనే వ్యాధి నేపథ్యంతో మహానుభావుడు చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఓసీడితో బాధపడే శర్వానంద్‌పై కామెడీ సీన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి.
 
హీరో శర్వానంద్, హీరోయిన్ మెహ్రీన్ ఒకే ఆఫీస్‌లో పనిచేసే ఉద్యోగులు. మెహ్రీన్‌పై శర్వానంద్ పీకల్లోతు మునిగిపోతాడు. వారి మధ్య వచ్చే తొలి పాట రెండు కళ్లు ఫీల్‌ గుడ్‌గా ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.