బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By pnr
Last Updated : సోమవారం, 25 సెప్టెంబరు 2017 (14:46 IST)

'కేరాఫ్ సూర్య' అంటున్న సందీప్ కిషన్... (Teaser)

యువ హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా దర్శకుడు సుశీంద్రన్ 'కేరాఫ్ సూర్య' అనే చిత్రం తెరకెక్కుతోంది. సందీప్ సరసన కథానాయికగా మెహ్రీన్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు.

యువ హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా దర్శకుడు సుశీంద్రన్ 'కేరాఫ్ సూర్య' అనే చిత్రం తెరకెక్కుతోంది. సందీప్ సరసన కథానాయికగా మెహ్రీన్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ, కామెడీకి ప్రాధాన్యతనిస్తూ ఈ టీజర్‌ను తయారు చేసి రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో యూత్‌ను ఆకట్టుకునే అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
 
కాగా, తెలుగులో సందీప్ కిషన్‌ను సక్సెస్ పలకరించి చాలాకాలమే అయింది. దాంతో ఆయన సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ హిట్ ఈ సినిమాతో లభించడం ఖాయమనే ఆశతో ఉన్నాడు. ఆయన ఆశను ఈ సినిమా నెరవేర్చుతుందేమో చూడాలి. ఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహా ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత చక్రి చిగురుపాటి నిర్మిస్తున్నారు.