మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 15 ఆగస్టు 2017 (10:27 IST)

''అయామ్ బ్లైండ్ .. బట్ అయామ్ ట్రైన్డ్" : 'రాజా ది గ్రేట్' టీజర్ రిలీజ్

టాలీవుడ్ హీరో రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నిర్మితమైన చిత్రం 'రాజా ది గ్రేట్'. ఈ చిత్రంలో హీరో చూపులేని వ్యక్తి (దివ్యాంగుడు)గా నటిస్తున్నాడు. రవితేజ కెరియర్లో ఈ తరహా పాత్రను పోషించడం ఇదే

టాలీవుడ్ హీరో రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నిర్మితమైన చిత్రం 'రాజా ది గ్రేట్'. ఈ చిత్రంలో హీరో చూపులేని వ్యక్తి (దివ్యాంగుడు)గా నటిస్తున్నాడు. రవితేజ కెరియర్లో ఈ తరహా పాత్రను పోషించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ సినిమా టీజర్‌ను స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ ఈ టీజర్‌ను కట్ చేశారు.
 
"నా కొడుకు ఈ ప్రపంచాన్ని చూడలేక పోవచ్చు. కానీ నా కొడుకేంటన్నది ఈ ప్రపంచం చూడాలి" అంటూ ఎమోషన్‌తో రాధిక చెప్పిన డైలాగ్ ఆకట్టుకునేలా వుంది. ''అయామ్ బ్లైండ్ .. బట్ అయామ్ ట్రైన్డ్" అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ కూడా బాగా పేలింది. యాక్షన్ .. ఎమోషన్ సీన్స్‌పై కట్ చేసిన ఈ టీజర్, ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.